
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి తెలంగాణ సీఎం అవుతారని మజ్లిస్ అధి నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. సోమవారం హైదరాబాద్ దారు స్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతే తెలంగాణ అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణతోపాటు మొదటిసారిగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ప్రకటించారు. రాజస్తాన్‌కు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించామని, త్వరలో తెలంగాణ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. తాము నిరంతరం ప్రజల మధ్యలో ఉంటామని, పోటీచేసే ప్రతి చోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment