రేవంత్‌ సినిమా మొత్తం మా దగ్గరుంది.. ఒవైసీ షాకింగ్‌ కామెంట్స్‌ | MIM Asaduddin Owaisi Shocking Comments Over Revanth Reddy Ahead Of Assembly Elections - Sakshi
Sakshi News home page

రేవంత్‌ సినిమా మొత్తం మా దగ్గరుంది.. ఒవైసీ షాకింగ్‌ కామెంట్స్‌

Published Sat, Oct 7 2023 3:23 PM | Last Updated on Sat, Oct 7 2023 4:45 PM

MIM Asaduddin Owaisi Shocking Comments Over Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ​ంలో పొలిటికల్‌ నేతల మధ్య మాటల యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటోంది. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన కామెంట్స్‌ చేశారు. 

తాజాగా అసదుద్దీన్‌ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ సినిమా మా దగ్గర ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్‌ గూటికి వచ్చి చేరారు. రేవంత్ రెడ్డి జీవితమంతా బీజేపీ, ఆరెస్సెస్‌తోనే ముడిపడి వుందన్నారు. దశాబ్థాల పాటు రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డితోనే కలిసి తిరిగారని ఒవైసీ ఆరోపించారు. ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందని రేవంత్ అంటున్నారని.. కానీ తన తాత ముత్తాతలు హిందుస్తాన్‌లోనే పుట్టారని స్పష్టం చేశారు. నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు తనకు లేదా అని ఒవైసీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అసలు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు ఆరెస్సెస్ నాలుక నుంచి వచ్చినవని అసదుద్దీన్ దుయ్యబట్టారు. 

1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పనిచేయడాన్ని తాను చూశానని ఒవైసీ ఆరోపించారు. ఆయన ముందు ఏబీవీపీలో అటు నుంచి ఆరెస్సెస్ అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్లినట్టు ఒవైసీ ఆరోపించారు. ఆరెస్సెస్ వాళ్లు చంద్రబాబు వద్దకు వెళ్లమంటే అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఆయన పని అయిపోగానే కాంగ్రెస్‌లోకి వెళ్లాడని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తావా అని  ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: అమిత్‌ షా జోక్యంతో లైన్‌ క్లియర్‌.. బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement