
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీ వదిలిపోతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అంటూ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విషం కక్కుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. భయపడేవాళ్లు పాకిస్తాన్ పారిపోయారు.. తాము కొట్లాడే వాళ్లం కాబట్టి ఇక్కడే ఉన్నాం అంటున్నాడు ఓవైసీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే అని అన్నారు.
అసదుద్దీన్ దేశం విడిచి పారిపోవడం ఖాయమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మతకల్లోలు జరగొద్దని నిన్న ఒక్కరోజు ఇంట్లో నమాజః్ చేసుకోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తే తప్పు పట్టారన్నారు. అసదుద్దీన్ కు ట్రీట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ కు విజ‍్క్షప్తి చేస్తున్నానని చమత్కరించారు రాజాసింగ్.
Comments
Please login to add a commentAdd a comment