ముస్లింలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డి
జూబ్లీహిల్స్: ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇచ్చిన ఛాలెంజ్‌ను ఎంపీ రేవంత్‌రెడ్డి స్వీకరించారు. ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలని ఆమె సోషల్ మీడియా వేదికగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి ట్యాగ్ చేశారు. స్పందించిన రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని మల్కాజ్‌గిరి ఎంపీ కార్యాలయానికి 4,500 మందికి సరిపడా నిత్యావసర సరుకులను పంపించారు. ఈ సరుకులను రంజాన్ దీక్షలో ఉండే ముస్లింలతో పాటు ఆకలితో ఉన్న పేద కుటుంబాలకు అందిస్తామని ఆయన తెలిపారు. (‘సీతక్క మీరు చరిత్రలో నిలిచిపోతారు..’)
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి మద్యం అమ్మకాల మీద ఉన్న శ్రద్ధ పేదల మీద లేదన్నారు. నిన్న జరిగిన కేబినేట్ భేటీ తర్వాత పేదల కోసం ఏదైనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశించామని తీరా చూస్తే మద్యం షాపుల ఓపెనింగ్ కోసమే కేబినేట్ భేటీ జరిగినట్లుందన్నారు. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించినట్లుగానే మిగతా షాపులను కూడా తెరిచేందుకు అనుమతుల్వివాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(అక్కొచ్చె.. అన్నం తెచ్చె..)
Comments
Please login to add a commentAdd a comment