UTT 2024: అహ్మదాబాద్‌కు రెండో విజయం | Ahmedabad SG Pipers Hold Off U Mumba TT In UTT 2024 | Sakshi
Sakshi News home page

UTT 2024: అహ్మదాబాద్‌కు రెండో విజయం

Published Wed, Aug 28 2024 10:32 AM | Last Updated on Wed, Aug 28 2024 10:39 AM

Ahmedabad SG Pipers Hold Off U Mumba TT In UTT 2024

చెన్నై: అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ) లీగ్‌లో కొత్త జట్టు అహ్మదాబాద్‌ ఎస్‌జీ పైపర్స్‌ రెండో విజయం అందుకుంది. యు ముంబా టీటీ జట్టుతో మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ జట్టు 9-6 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో మనుశ్‌ షా (అహ్మదాబాద్‌) 2-11, 9-11, 11-8తో మానవ్‌ ఠక్కర్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో రీత్‌ రిష్యా (అహ్మదాబాద్‌) 5-11, 11-8, 11-7తో సుతీర్థ ముఖర్జీపై నెగ్గింది. 

మూడో మ్యాచ్‌లో మనుశ్‌-బెర్నాడెట్‌ జాక్స్‌ ద్వయం 11-4, 11-8, 11-8తో మానవ్‌-మరియా జియో జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌లో లిలియన్‌ బార్డెట్‌ (అహ్మదాబాద్‌) 5-11, 11-9, 9-11తో ఖాద్రీ అరునా చేతిలో ఓటమి చవిచూశాడు. ఐదో మ్యాచ్‌లో బెర్నాడెట్‌ జాక్స్‌ 9-11, 11-4, 11-6తో మరియా జియోపై గెలిచి అహ్మదాబాద్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం అహ్మదాబాద్‌ జట్టు 24 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement