Ultimate Table Tennis
-
UTT 2024: అహ్మదాబాద్‌కు రెండో విజయం
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో కొత్త జట్టు అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ రెండో విజయం అందుకుంది. యు ముంబా టీటీ జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ జట్టు 9-6 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో మనుశ్ షా (అహ్మదాబాద్) 2-11, 9-11, 11-8తో మానవ్ ఠక్కర్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో రీత్ రిష్యా (అహ్మదాబాద్) 5-11, 11-8, 11-7తో సుతీర్థ ముఖర్జీపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో మనుశ్-బెర్నాడెట్ జాక్స్ ద్వయం 11-4, 11-8, 11-8తో మానవ్-మరియా జియో జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌లో లిలియన్ బార్డెట్ (అహ్మదాబాద్) 5-11, 11-9, 9-11తో ఖాద్రీ అరునా చేతిలో ఓటమి చవిచూశాడు. ఐదో మ్యాచ్‌లో బెర్నాడెట్ జాక్స్ 9-11, 11-4, 11-6తో మరియా జియోపై గెలిచి అహ్మదాబాద్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం అహ్మదాబాద్ జట్టు 24 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
ఫ్రాంచైజ్ లీగ్ టోర్నమెంట్లో గోవా చాలెంజర్స్ శుభారంభం
చెన్నై: ఫ్రాంచైజీ లీగ్ టోర్నీ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఐదో సీజన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రోజు డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ శుభారంభం చేసింది. చాలెంజర్స్ 9–6 పాయింట్ల తేడాతో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతున్న జైపూర్ పేట్రియాట్స్‌పై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 1–2 తేడాతో చో సుంగ్ మిన్ చేతిలో ఓడగా... మహిళల సింగిల్స్‌లో ల్యూ యాంగ్ జి 3–0తో సుతాసిని సవేతాత్ను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో హర్మీత్–ల్యూ ద్వయం 2–1తో రోనిత్ భాంజా–సుతాసినిలపై గెలుపొందింది. రెండో పురుషుల సింగిల్స్‌లో మిహాయి బొబొసికా 2–1తో రోనిత్ భాంజాను ఓడించగా... రెండో మహిళల సింగిల్స్‌లో నిత్యశ్రీ మణి 2–1తో యశస్విని ఘోర్పడేపై విజయం సాధించింది.ఐదు మ్యాచ్‌ల ఈ పోరులో మూడు మ్యాచ్‌లు నెగ్గిన గోవా ఖాతాలో 9 పాయింట్లు చేరగా... రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పేట్రియాట్స్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. అంతకుముందు తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ లీగ్‌ను ప్రారంభించారు.