
చెన్నై: ఫ్రాంచైజీ లీగ్ టోర్నీ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఐదో సీజన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రోజు డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ శుభారంభం చేసింది. చాలెంజర్స్ 9–6 పాయింట్ల తేడాతో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతున్న జైపూర్ పేట్రియాట్స్‌పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 1–2 తేడాతో చో సుంగ్ మిన్ చేతిలో ఓడగా... మహిళల సింగిల్స్‌లో ల్యూ యాంగ్ జి 3–0తో సుతాసిని సవేతాత్‌ను చిత్తు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో హర్మీత్–ల్యూ ద్వయం 2–1తో రోనిత్ భాంజా–సుతాసినిలపై గెలుపొందింది. రెండో పురుషుల సింగిల్స్‌లో మిహాయి బొబొసికా 2–1తో రోనిత్ భాంజాను ఓడించగా... రెండో మహిళల సింగిల్స్‌లో నిత్యశ్రీ మణి 2–1తో యశస్విని ఘోర్పడేపై విజయం సాధించింది.
ఐదు మ్యాచ్‌ల ఈ పోరులో మూడు మ్యాచ్‌లు నెగ్గిన గోవా ఖాతాలో 9 పాయింట్లు చేరగా... రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పేట్రియాట్స్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. అంతకుముందు తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ లీగ్‌ను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment