ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ | Dabang Delhi Beat Ahmedabad SG Pipers | Sakshi
Sakshi News home page

ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ

Published Sat, Sep 7 2024 10:18 AM | Last Updated on Sat, Sep 7 2024 1:40 PM

Dabang Delhi Beat Ahmedabad SG Pipers

    గోవాతో నేడు అమీతుమీ 

    అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌  

 

చెన్నై: అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ) లీగ్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఢిల్లీ 8–6తో అహ్మదాబాద్‌ ఎస్జీ పైపర్స్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ గోవా చాలెంజర్స్‌తో మాజీ చాంపియన్‌ దబంగ్‌ ఢిల్లీ తలపడుతుంది.

 తొలి పురుషుల సింగిల్స్‌లో సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ 1–2 (4–11, 11–5, 5–11)తో లిలియాన్‌ బార్డెట్‌ చేతిలో ఓడిపోగా, మహిళల సింగిల్స్‌లో ఒరవన్‌ పరనగ్‌ 3–0 (11–7, 11–9, 11–9)తో బెర్నడెట్‌ సాక్స్‌పై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఒరవన్‌–సత్యన్‌ జోడీ 0–3 (9–11, 7–11, 9–11)తో బెర్నడెట్‌ సాక్స్‌–మానుశ్‌ షా ద్వయం చేతిలో ఓడింది. రెండో పురుషుల సింగిల్స్‌లో అండ్రియస్‌ లెవెంకొ 2–1 (11–8, 10–11, 11–8)తో మానుశ్‌ షాపై గెలుపొందాడు. 

గేమ్‌ల పరంగా ఇరుజట్ల స్కోరు 6–6తో సమం కాగా కీలకమైన రెండో మహిళల సింగిల్స్‌లోకి దిగిన ఢిల్లీ ప్లేయర్‌ దియా చిటాలే వరుస గేమ్‌లు గెలిచి జట్టును గెలిపించింది. ఆమె  2–0 (11–8, 11–4)తో రీత్‌ రిష్యాపై నెగ్గడంతో దబంగ్‌ ఢిల్లీ విజయం ఖాయమైంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement