ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలినీయర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు 'జీత్ అదానీ'తో 'దివా జైమిన్ షా' పెళ్లి అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్ శాంతిగ్రామ్‌లో గుజరాతీ సంప్రదాయంలో చాలా సింపుల్‌గా జరిగింది. పెళ్లి తరువాత మొదటిసారి భార్యతో ఉన్న ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
పెళ్లికి ముందు గౌతమ్ అదానీ 'మంగళ సేవ' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగ యువతులకు సాయం అందించే కార్యక్రమం. దీని ద్వారా ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని జీత్ అదానీ, దివా దంపతులు సంకల్పించారు. లాంఛనంగా 21 మంది దివ్యాంగుల వధూవరులను కలిసి జీత్ అదానీ ఈ చొరవను ప్రారంభించారు.
Mr. and Mrs. Adani - To infinity and beyond! pic.twitter.com/vy0LAzvYSv
— Jeet Adani (@jeet_adani1) February 8, 2025
Comments
Please login to add a commentAdd a comment