
విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా
ఔరంగాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికే ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించారని, ట్రిపుల్ తలాక్‌పై చట్టాలు చేయడానికి కాదని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేసిన తొగాడియా..రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా చట్టం చేయాలన్నారు. ‘ప్రజలు మీకు ట్రిపుల్ తలాక్‌పై చట్టాలు చేయడానికి ఓట్లేయలేదు. రామ మందిర నిర్మాణం కోసమే పట్టం గట్టారు’ అని ఔరంగాబాద్‌లో అన్నారు. ట్రిపుల్ తలాక్‌పై చట్టం చేయడం, చేయకపోవడం ప్రభుత్వ ఇష్టమని, కానీ రామ మందిర నిర్మాణానికి మాత్రం చట్టం రూపొందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment