
ప్రతీకాత్మక చిత్రం
చండీగఢ్ : నిత్యం వేధింపులకు గురిచేస్తూ, విడాకులు ఇస్తానని బెదిరిస్తున్న భర్తకు తగిన బుద్థి చెప్పింది ఓ భార్య. భర్త పెట్టే చిత్రహింసల నుంచి విముక్తి పొందేందుకు తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన షాజియాకు అబ్బాస్ అనే వ్యక్తితో నిఖా జరిగింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లైన రెండో రోజు నుంచే అబ్బాస్.. షాజియాను వేధింపులకు గురి చేసేవాడు. రోజూ తాగి వచ్చి తీవ్రంగా హింసించేవాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే ట్రిపుల్ తలాక్ చెబుతానంటూ బెదిరించేవాడు.
ఈ క్రమంలో భర్త ప్రవర్తనతో విసిగిపోయిన షాజియా.. ‘ నువ్వు నాకు విడాకులివ్వడం కాదు. నేనే నీ నుంచి విడాకులు తీసుకుంటున్నా. నన్ను వేధింపులకు గురి చేసినందుకు నీ తగిన శాస్తి చేయాలనుకున్నాను. తప్పో ఒప్పో అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. తలాక్, తలాక్, తలాక్’ అంటూ భర్తకు ఉత్తరం రాసింది. ఆ తర్వాత బ్రహ్మచారి అయిన తన మేనల్లుడితో కలిసి ఊరు విడిచి వెళ్లి పోయింది. ఇందుకు సంబంధించి షాజియా భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ముస్లిం మహిళల హక్కులకు భంగం కలుగుతోందంటూ ట్రిపుల్ తలాక్ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో షాజియా చర్య గురించి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి
Comments
Please login to add a commentAdd a comment