
సాక్షి, లక్నో : కొన్ని విషయాల్లో పర్వాలేదు అనిపించినా ఒక్కోసారి గ్రామ పంచాయతీల్లో పరిష్కారం అయ్యే పంచాయితీలు ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో ఊహించలేం. కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా సవరించుకోలేని నష్టాన్ని కలిగించొచ్చు. అందుకు ఉదాహరణగా తాజాగా ఓ ముస్లిం మహిళ జీవితంలో జరిగిన సంఘటన అద్దం పడుతోంది. త్వరలో రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రానుండగా మరో మహిళ ట్రిపుల్ తలాక్ విధానానికి బలైంది. అది కూడా తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి చేతిలోనే.. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ ముస్లిం వ్యక్తి ఓ ముస్లిం మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్‌కు వెళ్లనివ్వకుండా అదే గ్రామంలో పరిష్కరించాలని నిర్ణయించారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సమస్య తీరుతుందని పంచాయతీ పెద్దలు తీర్పు చెబుతూ ఆమెపై ఒత్తిడి చేశారు. దీంతో చేసిది లేక ఆ బాధితురాలు అతడినే వివాహం ఆడింది. అయితే, పెళ్లి చేసుకున్నప్పటికీ నుంచి అతడు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఆమె తండ్రిని, ఆమెను బలవంతంగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి విడాకుల పత్రాలపై సంతకం చేయించుకున్నాడు. అనంతరం తలాక్ తలాక్ అంటూ మూడుసార్లు చెప్పేశాడు. దీంతో బాధితురాలు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment