
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభలో ఉన్న స్పష్టమైన మెజారిటీతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం పొందటం ప్రభుత్వానికి పెద్ద కష్టమేం కాలేదు. దీనికి తోడు కాంగ్రెస్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించకపోవటంతో సాఫీగానే ఎన్డీయే ముందడుగేసింది. కానీ రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అయితే ఈ బిల్లును గెలిపించుకునేందుకు టీఎంసీ సహా పలు విపక్ష పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయి. మొదట్లో బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే.. కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లకపోయినా ఓటింగ్‌లో పాల్గొనబోమని వెల్లడించింది. పలు మార్పులతోపాటు, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకోవాలని భావిస్తోంది. కాగా, ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సభలో లేరు. కేవలం 15–20 మంది కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే సభకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment