న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు ఎనలేని భద్రత లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముస్లిం మహిళల పురోగతికి తాము చేపడుతున్న చర్యల గురించి అందరిలోనూ అవగాహన పెంచాలని తనను కలిసిన పార్టీ ఎంపీలకు చెప్పారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎంపీలతో మాట్లాడుతూ 2024 ఎన్నికలకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. రానున్న రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ వర్గాల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న చర్యల్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని చెప్పినట్టుగా కొందరు ఎంపీలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment