బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం) బిల్లుకు రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్ ఫిగర్ అనూహ్యంగా తగ్గింది. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు.