కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం తీవ్రం
న్యూఢిల్లీ: జడ్జిల నియామకం విషయంలో కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య వివాదం తీవ్రతరమైంది. జడ్జీల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 500 హైకోర్టు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ధీటుగా స్పందించారు. అందరితో పాటూ న్యాయవ్యవస్థకూ లక్షణ రేఖ ఉంటుందన్నారు. ఆ లక్ష్మణరేఖను న్యాయవ్యవస్థ గుర్తించాలని సూచించారు. ఆత్మపరిశీలనకు సిద్ధం కాలాలని ముకుల్ రోహత్గీ తెలిపారు.