‘ముస్లింల పెళ్లి, విడాకులపై కొత్త చట్టం తెస్తాం’ | Will frame a law if triple talaq is struck down: Mukul Rohatgi | Sakshi
Sakshi News home page

‘ముస్లింల పెళ్లి, విడాకులపై కొత్త చట్టం తెస్తాం’

Published Mon, May 15 2017 1:46 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

‘ముస్లింల పెళ్లి, విడాకులపై కొత్త చట్టం తెస్తాం’ - Sakshi

‘ముస్లింల పెళ్లి, విడాకులపై కొత్త చట్టం తెస్తాం’

న్యూఢిల్లీ: ముస్లింల ట్రిపుల్‌ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేస్తే వారికి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టుకు హాజరైన అటార్నీ జనరల్‌ ముఖుల్‌ రోహత్గీ వివరణ ఇచ్చారు. ఐదుగురు న్యాయమూర్తులతో​ కూడిన సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలో ట్రిపుల్‌ తలాక్‌ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఒక వేళ ట్రిపుల్‌ తలాక్‌ విధానం ఆగిపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిన నేపథ్యం రోహత్గీ ఈ వివరణ ఇచ్చారు.

‘ఒక వేళ సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ విధానం విలువలేనిదని కొట్టి వేస్తే ముస్లింల వివాహం, విడాకుల అంశాన్ని క్రమబద్ధీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది’అని ఆయన చెప్పారు. అంతకుముందు తమకు తక్కువ సమయం ఉన్నందున ప్రస్తుతం ట్రిపుల్‌ తలాఖ్‌ అంశాన్ని పరిష్కరించి ఆ తర్వాత బహుభార్యత్వం, నిఖా హలాలావంటి మిగితా విషయాల సంగతి భవిష్యత్తులో చూస్తామని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి

‘బహుభార్యత్వంపై తర్వాత.. ముందు తలాక్‌పై..‌’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement