న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చైనా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ తరపున కోర్టులో వాదించడానికి నిరాకరించారు. లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీ ముఖాముఖి నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 మొబైల్ యాప్‌లపై కేంద్రం నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. చైనా కంపెనీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ యాప్‌ల తొలగింపుపై కోర్టుకు వెళ్తారని వస్తున్న వార్తలను ముకుల్ రోహత్గి ఖండించారు.
ఈ మేరకు ఆయన బుధవారం రోజున మాట్లాడుతూ.. టిక్‌టాక్ సంస్థ వారి తరపున కోర్టులో వాదనలు వినిపించాలని కోరింది. అయితే టిక్‌టాక్ అభ్యర్థనను తిరస్కరించాను. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కోర్టులో వాదించబోనని ఆ సంస్థకు స్పష్టం చేశానని పేర్కొన్నారు. కాగా.. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతల నేపథ్యంలో చైనాకు సంబంధించిన టిక్ టాక్‌తోసహా లైకీ, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, విగొ వీడియో వంటి 59 రకాల యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. (59 యాప్స్ నిషేధం: చైనా ఆందోళన)
Comments
Please login to add a commentAdd a comment