'మాల్యా రావాలి.. పాస్ పోర్టు ఇవ్వాలి'
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో ఆర్థిక కుంభకోణానికి పాల్పడి విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి రావాల్సిందేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అన్నారు. వచ్చి పాస్ పోర్టు అధికారులకు అప్పగించాలని చెప్పారు. 'సుప్రీంకోర్టు అయితే అతడిని ఇండియాకు రావాలని, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించలేదు.
కానీ, సుప్రీంకోర్టు సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటుందో అప్పుడు ఆ వ్యక్తిగతంగాగానీ, లాయర్ ద్వారాగాగానీ హాజరుకావచ్చు. అయితే, మాల్యానే రావాలనేం లేదు.. న్యాయవాది ద్వారా కూడా రావొచ్చు. అయితే, మాల్యా ఎప్పటికైనా రావాల్సిందే.. తన పాస్ పోర్ట్ ఇవ్వాల్సిందే' అని రోహత్గీ అన్నారు.