కలకత్తా కోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్‌పై చర్యలకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఆదేశాలు జారీ చేశారు.
కలకత్తా కోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్‌పై చర్యలకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఆదేశాలు జారీ చేశారు. కర్నన్ తోటి జడ్జిలపై ఆరోపణలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌ను కోరింది. సుప్రీం ఆదేశాల మేరకు స్పందించిన అటార్నీ కర్నన్‌ను విచారణ కోసం సుప్రీంకోర్టులో హాజరుకావాలని కోరారు.
కాగా, అటార్నీ ఆదేశాలను ధిక్కరించిన కర్నన్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కర్నన్‌పై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓ హైకోర్టు జడ్జి వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్రంగా బాధిస్తోందని ముకుల్ చెప్పారు. బాధ్యతాయుతమైన స్ధానంలో ఉండి తోటి వారిపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.