karnan
-
చూపు... రీమేక్ వైపు...
ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణమే. అయితే పాన్ ఇండియా ఫార్ములా వచ్చిన తర్వాత కూడా రీమేక్ మంత్రం వెండితెరపై వినిపిస్తోంది కొందరు తారలు రీమేక్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. రీమేక్ చిత్రాలవైపు ఓ చూపు చూస్తున్న ఆ స్టార్స్‌పై ఓ లుక్ వేయండి. మలయాళ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో ఇటీవల చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. మరో రీమేక్ ‘బోళా శంకర్’లో కనిపించనున్నారాయన. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా, చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. 2015లో అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా ‘బోళా శంకర్’ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నారు. మరోవైపు మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ (2019) తెలుగు రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు హీరో–నిర్మాత మంచు విష్ణు. మోహన్‌బాబు మెయిన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్క నుందని సమాచారం. అలాగే మరో మలయాళ చిత్రం ‘పొరింజు మరియం జోస్’ (2019) తెలుగులో రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాగార్జున హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారట. ఇక హీరో పవన్ కల్యాణ్ కెరీర్‌లోని రీమేక్ చిత్రాల్లో తమిళ చిత్రం ‘తేరి’ కూడా చేరనుందని టాక్. ఈ సినిమాకు దర్శకుడిగా తొలుత సుజిత్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హిట్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటైన ‘మానాడు’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం జరిగినా, ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ నిర్మాణ భాగస్వామిగా ‘లక్కీ కీ’ అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ తెలుగులో ‘బుట్ట బొమ్మ’గా రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్ర శేఖర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా తమిళ హిట్ ఫిల్మ్ ధనుష్ ‘కర్ణన్’ తెలుగులో రీమేక్ కానున్నట్లు, ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించ నున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు ‘నాయట్టు’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘బ్రో డాడీ’, తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’, హిందీ ‘డ్రీమ్ గాళ్’, ‘దే దే ప్యార్ దే’ ‘బదాయీ దో’ వంటివి కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఈ రీమేక్ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరతాయి. -
OTT: ఐదు సినిమాలు నేడే విడుదల!
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోయేవి. జనాలు కూడా కొత్త చిత్రాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయా? అని ఈ రోజు కోసం తెగ ఎదురుచూసేవాళ్లేవారు. కానీ కరోనా పుణ్యమా అని అన్ని రోజులూ ఆదివారాలే అయిపోయాయి. థియేటర్లకు కూడా హాలీడేస్ వచ్చేశాయి. కానీ ప్రేక్షకుడికి అందించే వినోదానికి మాత్రం బ్రేక్ రాలేదు. సినిమాలు కాకపోతే వెబ్ సిరీస్‌లు, థియేటర్లు కాకపోతే ఓటీటీలు.. ఇలా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త దారుల్లో పయనిస్తోంది చిత్ర పరిశ్రమ. ఈ క్రమంలో నేడు(మే 14) ఐదు సినిమాలు ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయ్యాయి. అవేంటో చదివేయండి.. విజయ్ సేతుపతి తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విజయ్ సేతుపతి. తెలుగులో విలన్, సహాయక పాత్రల్లో మాత్రమే కనిపించిన సేతుపతి ఇందులో హీరోగా సందడి చేయనున్నాడు. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేటి నుంచి ప్రసారం కానుంది. కర్ణన్ తమిళ హీరో ధనుష్ నటించిన కర్ణన్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించిన ఈ సినిమా ఓటీటీని ఎలా షేక్ చేస్తుందో చూడాలి. సినిమా బండి ప్రవీణ్ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సినిమా బండి. ఇటీవల రిలీజైన ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయగా నేటి నుంచి ప్రసారం చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. చెక్ యంగ్ హీరో నితిన్ ఖైదీగా, ప్రియా వారియర్ అతడి ప్రేయసిగా నటించిన చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా కనిపించింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీ బాట పట్టిన ఈ మూవీ నేటి నుంచి సన్ నెక్స్ట్ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. బట్టల రామస్వామి బయోపిక్కు అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బట్టల రామస్వామి బయెపిక్కు. రామ్ నారాయణ్ డైరెక్షన్ చేయగా సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా జీ 5లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇక రామ్‌గోపాల్ వర్మ డీ కంపెనీ సినిమా కూడా ఓటీటీలో వస్తోంది. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక రాధే సినిమా నిన్నటి నుంచే జీ 5లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. -
Karnan: ఓటీటీలో ధనుష్ సినిమా, ఎప్పటినుంచంటే?
తమిళ హీరో ధనుష్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన జగమే తంత్రం సినిమా నేరుగా ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే కదా! ఈ చిత్రం జూన్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తాజాగా అతడి మరో సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతోంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కర్ణన్ సినిమాకు అమెజాన్ ప్రైమ్‌తో మంచి డీల్ కుదిరింది. దీంతో ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో మే 14 నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్ 9న థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించిన ఈ సినిమా నెల రోజులకే ఓటీటీలోకి వస్తుండటంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లాల్, రాజీశ విజయన్, నాట్టీ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్ నిర్మించాయి. The face of the faceless. Meet #KarnanOnPrime, May 14@dhanushkraja @mari_selvaraj @theVcreations @Music_Santhosh @rajishavijayan @natty_nataraj @LalDirector @iYogiBabu @LakshmiPriyaaC @Gourayy @EditorSelva @thinkmusicindia @thenieswar @idiamondbabu @RIAZtheboss pic.twitter.com/rGXrO9hkMA — amazon prime video IN (@PrimeVideoIN) May 10, 2021 చదవండి: OTT: మేలో అలరించనున్న సినిమాలివే! -
Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలోఘీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ మూవీ రీమేక్‌తో బాలీవుడ్లో ఎంట్రీకీ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బెల్లంకొండ సరసన నటించేందుకు ఇదివరకే కొందరు స్టార్ హీరోయిన్లను సైతం సంప్రదించినా వారు మాత్రం నో చెప్పారట. దీంతో ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ చేసేందుకు అనన్య పాండే ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బెల్లంకొండ ఇప్పుడు మరో రీమేక్ చిత్రంతో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇటీవల ధనుష్ హీరోగా తమిళంలో ‘కర్ణన్’ సూపర్ రిలీజైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే బెల్లంకొండ ఈ మూవీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బెల్లంకొండ తెలుగులో నటించిన చివరి మూవీ అల్లుడు అదుర్స్’. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేసినా బాక్స్‌ఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. దీంతో కర్ణన్ మూవీని రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. చదవండి : 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' నిర్మాతగా మారిన యంగ్ హీరో.. తండ్రితో తొలి సినిమా! -
OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
2020 సంవత్సరంతోనే కరోనా పీడ విరగడువుతుందనకుంటే అది మరింత విజృంభిస్తూ ఇక్కడే తిష్ట వేసింది. దీంతో గతేడాదే వినోదానికి దూరమైన సినీ లవర్స్ ఈసారి కూడా తమకు ఎంటర్టైన్మెంట్ దొరకదా? అని నెత్తిన చేయి పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటివారికోసమే దర్శకనిర్మాతలు కొత్త రూట్లో పయనిస్తున్నారు. థియేటర్ లేకపోతే ఓటీటీ ఉందిగా, ఇంక టెన్షన్ ఎందుకు దండగ అని అభయమిస్తున్నారు. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే చాలామంది ఓటీటీకి జై కొడుతున్నారు. ఫలితంగా థియేటర్లో రిలీజైన సినిమాలు, ఇంకా విడుదల కాని సినిమాలు అన్నీ కూడా పోలోమని ఓటీటీకి క్యూ కడుతున్నాయి. తాజాగా కొన్ని పెద్ద, చిన్న సినిమాలు కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ డేట్స్‌ను ప్రకటించాయి. అవేంటో చూసేద్దాం.. జగమే తంత్రం.. హీరో ధనుష్- కార్తీక్ సుబ్బరాజు కలయికలో వచ్చిన చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల అవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. కరోనా కారణంగా చాలా నెలల నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడట. వకీల్ సాబ్.. ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 'వకీల్ సాబ్'. 'అజ్ఙాతవాసి' డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. థ్యాంక్ యు బ్రదర్.. యాంకర్ అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో అనసూయ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. నారప్ప.. విక్టీర వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప'. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తారా? లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నారప్పను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రంగ్‌దే.. నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ మంచి డీల్ కుదిరితే మే 21 నుంచి జీ 5లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్ణన్.. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర్ణన్'. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్లో మార్పు ఉండే అవకాశం ఉంది. మోహన్ గోవింద్ డైరెక్షన్లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన 'పిజ్జా 3 ద మమ్మీ' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట. కార్తీ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'సుల్తాన్' ఆహాలో మే 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మే 13న అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. చదవండి: మీ డ్యాన్స్, స్టైల్.. ఫెంటాస్టిక్, లవ్ యూ అల్లు అర్జున్: సల్మాన్ బిగ్‌బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్త ఓవర్ చేస్తోందంటూ.. -
కర్ణన్‌కు బెయిల్
సాక్షి, చెన్నై: రిటైర్డ్ న్యాయమూర్తి కర్ణన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు, న్యాయ లోకానికి వ్యతిరేకంగా రిటైర్డ్ న్యాయమూర్తి కర్ణన్ వీడియో విడుదల చేయడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ కేసు విచారణ సమయంలో హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. కర్ణన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. డీజీపీ, చెన్నై పోలీసు కమిషనర్లకు నోటీసులు సైతం జారీ అయ్యాయి. దీంతో కర్ణన్‌ను ఇటీవల అరెస్టు చేశారు. జైలులో ఉన్న కర్ణన్ బెయిల్ మంజూరు చేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్ కోసం విజ్ఞప్తి చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సాగిన విచారణలో వాదనల అనంతరం కర్ణన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. -
పట్ట పగలు మంత్రి ‘పిఏ’ కిడ్నాప్....!
-
సినీ ఫక్కీలో మంత్రి ‘పిఏ’ కిడ్నాప్....!
సాక్షి, చెన్నై : తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ వ్యక్తిగత పిఏ కర్ణన్‌ను పట్టపగలు నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేయడంతో పది కి.మీ దూరం వెళ్లి రోడ్డు మీద వదిలి పెట్టి వెళ్లారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో మంత్రి రాధాకృష్ణన్ ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. ఇక్కడ వ్యక్తిగత పిఏగా కర్ణన్ వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చిన నలుగురు యువకులు సిని తరహాలో కత్తులతో బెదిరించి ఆయన్ను కారులో ఎక్కించుకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో తిరుప్పూర్ జిల్లా పోలీసులు అంతా రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసు అధికారులు, అక్కడి సిసి కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా ఆ కారు, అందులో వచ్చిన నలుగురి కోసం వేట ముమ్మరం చేశారు. మంత్రి పిఏ కిడ్నాప్ సమాచారం ఉడుమలైలో కలకలం రేపింది. పోలీసులు నిఘా పెంచడంతో పాటుగా వ్యవహారం మీడియాల్లో హాట్ టాపిక్‌గా మారడంతో కిడ్నాపర్లు అప్రమత్తమైనట్టున్నారు. ఉడుమలై నుంచి పది కి.మీ దూరం వెళ్లిన కిడ్నాపర్లు, అక్కడ రోడ్డు పక్కగా కర్ణన్‌ను దించే వెళ్లి పోయారు. అయితే, ఈ కిడ్నాప్ ఎందుకు జరిగింది..? ఎవరు చేయించారు..? దీని వెనుకు ఉన్న రహస్యం బయట తీయడానికి పోలీసులు ఉరకలు తీస్తున్నారు. అయితే,కిడ్నాపర్లు నలుగురు మాస్క్‌లు ధరించి రావడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారి ఉన్నది. ఆన్లైన్ మోసంతో ....... ఈ కిడ్నాప్‌ను పక్కన పెడితే, చెన్నైలో మరో కిడ్నాప్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాగర్ కోయిల్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మోహన్ అనే ఉద్యోగిని కోయంబత్తూరుకు చెందిన రమేష్ రెడ్డి, ప్రభాకరన్‌లు కిడ్నాప్ చేసి చెన్నై పోలీసులకుఅ డ్డుంగా బుక్కయ్యారు. ఆన్లైన్లో నగదు బదిలీ పేరిట తనను మోసగించడమే కాకుండా, తరచూ డబ్బుల కోసం ప్రభాకరన్, రమేష్‌రెడ్డిలు వేదిస్తుండటంతో ఇవ్వలేని పరిస్థితుల్లో మోహన్ పడ్డాడు. దీంతో మోహన్‌ను కిడ్నాప్ చేసిన ప్రభాకరన్, రమేష్ రెడ్డిలు అడయార్ ఏసి విక్రమన్‌కు వచ్చిన సమాచారం మేరకు బుక్కయ్యారు. -
అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి
ఖమ్మంసహకారనగర్: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను తెరి చి ఖాతా నంబర్‌ను నామినేషన్ ఫారంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు ర్యాండమైజేషన్ నిర్వహించారు. అనంతరం రిట ర్నింగ్ అధికారులకు ఆన్లైన్ ద్వారా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్లను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థు లు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించాలని చెప్పారు. నామినేషన్‌తో పాటు ఫారం–26 అఫిడవిట్లో అభ్యర్థి పెండింగ్ నేర చరిత్ర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ ఫారం–26లో సమర్పించిన అభ్యర్థి నేర చరిత్ర పెండింగ్ వివరాలను నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థి, రాష్ట్రస్థాయిలో అభ్యర్థికి సంబంధించిన రాజకీయ పార్టీ పోలింగ్ కంటే రెండు రోజుల ముందు వరకు కనీసం మూడుసార్లు సర్క్యులేషన్ కలిగిన పేపర్లో, కేబుల్ టీవీలో ప్రచారం, ప్రసారం చేయాలని పేర్కొన్నారు. మొదటి ర్యాండమైజేషన్ పూర్తయిన ఈవీఎంలను నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రవాణా చేస్తామని, నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎంకే ఆయేషా, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, రిటర్నింగ్ అధికారులు జె.శ్రీనివాసరావు, ఆర్.దశరథ్, బి.శివాజీ, ఇన్చార్జ్ డీఆర్వో మదన్‌గోపాల్, ఎన్నికల డీటీ రాంబాబు, వివిధ పార్టీల నాయకులు ప్రకాష్, సింహాద్రి యాదవ్, శింగు నర్సింహారావు, విద్యాసాగర్, ప్రదీప్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు. -
జస్టిస్ కర్ణన్ విడుదల
తిరువొత్తియూరు(చెన్నై): కోర్టు ధిక్కార నేరం కింద ఆర్నెళ్ల జైలుశిక్ష పూర్తికావడంతో కలకత్తా హైకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ సీకే కర్ణన్ విడుదలయ్యారు. కోల్‌కతాలోని ‘ప్రెసిడెన్సీ కరెక్షనల్ హో మ్’ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు కర్ణన్ విడుదలైనట్లు ఆయన భార్య సరస్వతి మీడియాకు తెలిపారు. జస్టిస్ కర్ణన్ త్వరలోనే ఆత్మకథ రాయనున్నట్లు ఆయన న్యాయవాది మ్యాథ్యూ.జె.నెడంపుర వెల్లడించారు. పెన్షన్ తదితర సమస్యల్ని పరిష్కరించుకుని ఆయన త్వరలోనే చెన్నైకి బయలుదేరుతారన్నారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడటంతో సుప్రీం కోర్టు మే 9న జస్టిస్ కర్ణన్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. దీంతో జస్టిస్ కర్ణన్ పరారుకాగా.. సుప్రీం ఆదేశాలతో పోలీసులు కోయంబత్తూర్‌లో జూన్ 20న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. -
కర్ణన్ (కోల్‌కతా హైకోర్టు జడ్జి) రాయని డైరీ
‘‘ఎటువైపు వెళ్దాం జస్టిస్ కర్ణన్’’ అంటు న్నాడు మా డ్రైవర్. కారులో నేను, మా డ్రైవర్.. ఇద్దరమే ఉన్నాం. మూడు రోజులుగా ‘రన్ అవే’లో ఉన్నాం. చట్టానికి దొరక్కుండా! ‘‘జస్టిస్ కర్ణన్.. చెప్పండి. ఎటువైపు వెళ్దాం’’ అని మళ్లీ అడిగాడు మా డ్రైవర్. అతడినెప్పుడూ నేను డ్రైవర్లా చూడలేదు. అందుకే నన్ను ‘జస్టిస్ కర్ణన్’ అని స్వేచ్ఛగా సంబోధించగలుగుతున్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో పెళ్లిళ్లకు వెళ్లి ఉంటాం. ఎన్నో పెళ్లిళ్లలో పక్కపక్కనే కూర్చొని ఉంటాం. అతడెప్పుడూ నా కాలుకి తన కాలుని తగిలించలేదు. ‘‘పర్లేదు తగిలించు’’ అన్నాను ఓ పెళ్లిలో. ‘‘తగిలించినంత మాత్రాన మీ పట్టా నాకు వచ్చేయదు కదా జస్టిస్ కర్ణన్’’ అన్నాడు! నాకు ముచ్చటేసింది! మా డ్రైవర్‌కి ఉన్న జ్ఞానం నా బ్రదర్ జడ్జిలకు ఉంటే బాగుండేది! నేను జడ్జి అయిన కొత్తలో నా కాలికి కాలు తగిలించిన జడ్జి గుర్తుకొచ్చాడు. అప్పట్లో నాకు కాలు తగిలించినందుకు ఇప్పుడతడేమైనా గొప్పవాడు అయిపోయి, గొప్పగొప్ప తీర్పులు చెబుతున్నాడేమో తెలీదు. చీమ.. పుట్టని మర్చిపోకూడదు. ప్లీడర్‌గా పైకొచ్చిన వాడు చెట్టును మర్చిపోకూడదు. చెట్టును గుర్తు పెట్టుకున్న జడ్జి ఎవరూ ఇంకో జడ్జికి జైలు శిక్ష విధించడు. కానీ నాకు విధించాడు! ఎక్కడున్నా పట్టుకొచ్చి నన్ను జైల్లో పడేయమని డీజీపికి ఆదేశాలు ఇచ్చేశాడు. మీడియాక్కూడా చెప్పేశాడు.. కర్ణన్ని కవర్ చెయ్యొద్దని!! ‘నాకు వండిపెట్టొద్దని మీక్కూడా ఏమైనా ఉత్తర్వులు జారీ అయ్యాయా అని మా ఇంట్లోవాళ్లని అడిగాను. లేదన్నారు! మంచితనమో, అతి మంచితనమో.. కొంచెమింకా మిగిలే ఉన్నట్లుంది కోర్టు తీర్పుల్లో. ‘‘ఎటువైపు వెళ్దాం జస్టిస్ కర్ణన్’ అని మళ్లీ అడిగాడు డ్రైవర్. ‘‘ఏ రాష్ట్రంలో ఉన్నాం?’’ అని అడిగాను. ‘‘ఆంధ్రా నుంచి తెలంగాణా వచ్చాం’’ అన్నాడు. ‘‘ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్లొచ్చు’’ అని అడిగాను. మ్యాప్ తీశాడు. ‘‘డౌన్కెళితే కర్నాటక, అప్ ఎక్కితే మహారాష్ట్ర, సైడ్‌కి కొడితే చత్తీస్గడ్’’ అని చెప్పాడు. ‘‘అవన్నీ కాదు కానీ.. చెట్టు ఎక్కడ కనిపిస్తే అక్కడ కారు ఆపమని చెప్పాను. ‘‘చెట్టు కింద ఆపమంటారా? చెట్టు పక్కన ఆపమంటారా? చెట్టుకు దూరంగా ఆపమంటారా? చెట్టుకు సమీపంలో ఆపమంటారా?’’ అని అడిగాడు. భయంగా చూశాను. ‘‘చెట్టు కిందా కాదు, చెట్టు పక్కనా కాదు, చెట్టుకు దూరంగా కాదు, చెట్టుకు దగ్గరగా కాదు. చెట్టు నీడకు ఆపు కాసేపు’’ అని చెప్పాను. చెట్టు మీద నాకు నమ్మకం. న్యాయం ఇవ్వని జడ్జి ఉంటాడేమో కానీ, నీడను ఇవ్వని చెట్టు ఉండదని నా నమ్మకం. మాధవ్ శింగరాజు -
సంచలనం: సీజేఐకు ఐదేళ్ల శిక్ష విధించిన కర్ణన్
కోల్‌కతా: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కర్ణన్ సంచలన తీర్పుతో ఒక్కసారిగా న్యాయవ్యవస్ధ షాక్‌కు గురైంది. సీజేఐతో పాటు మరో ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కర్ణన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్-1989, 2015ల కింద వీరికి శిక్షను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల పాటు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. కుల వివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జరిమానాను వారం రోజుల్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చెల్లించాలని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తికి(అంటే కర్ణన్‌కు) చెల్లించాల్సిన రూ.14 కోట్ల పరిహారం ఇంకా అందలేదని, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆ డబ్బును జడ్జిల వేతనాల్లో నుంచి తీసుకుని అకౌంట్లో వేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగింది: తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్ కర్ణన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు. -
కర్నన్‌పై చర్యలకు ఆదేశం
కలకత్తా కోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్‌పై చర్యలకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఆదేశాలు జారీ చేశారు. కర్నన్ తోటి జడ్జిలపై ఆరోపణలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌ను కోరింది. సుప్రీం ఆదేశాల మేరకు స్పందించిన అటార్నీ కర్నన్‌ను విచారణ కోసం సుప్రీంకోర్టులో హాజరుకావాలని కోరారు. కాగా, అటార్నీ ఆదేశాలను ధిక్కరించిన కర్నన్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కర్నన్‌పై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓ హైకోర్టు జడ్జి వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్రంగా బాధిస్తోందని ముకుల్ చెప్పారు. బాధ్యతాయుతమైన స్ధానంలో ఉండి తోటి వారిపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. -
కర్ణన్ చేతికి అరెస్టు వారెంట్
-
కర్ణన్ చేతికి అరెస్టు వారెంట్
- న్యాయమూర్తి ఇంటికెళ్లి అందించిన డీజీపీ - తిరస్కరించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పశ్చిమబెంగాల్ డీజీపీ సుర్జిత్కర్ శుక్రవారం అందజేశారు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్, డీఐజీ (సీఐడీ) రాజేష్‌కుమార్‌తో కలసి ఇక్కడి కర్ణన్ ఇంటికి వెళ్లిన డీజీపీ... వారంట్‌ను ఆయన చేతికిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా, డీజీపీ అరెస్టు వారంట్ ఇచ్చిన కాసేపటికే దాన్ని తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ కర్ణన్ ప్రకటించారు. ‘ఓ దళిత జడ్జిని వేధింపులకు గురిచేస్తూ మీరు తీసుకుంటున్న ఇలాంటి కించపరిచే చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధం. కోర్టుల గౌరవ మర్యాదలను కాపాడేందుకు ఇకనైనా ఈ వేధింపులు ఆపమని అభ్యర్థిస్తున్నా’అని సీజే సహా తనకు అరెస్టు వారంట్ జారీ చేసిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ కర్ణన్ లేఖ రాశారు. మద్రాస్ హైకోర్టులోని కొందరు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారంటూ జస్టిస్ కర్ణన్ ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖెహర్‌కు లేఖలు రాసిన నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఈ నెల 10న జస్టిస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కారం కింద బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. మార్చి 31 లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. సిట్టింగ్ హైకోర్టు జడ్జిపై అరెస్టు వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, దళితుడిని కనుకనే తనపై దాడి చేస్తున్నారని కర్ణన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనపై అరెస్టు వారంట్ ఇచ్చిన సీజే, మరో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అధికార దుర్వినియోగం కింద విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆయన సీబీఐని కూడా ఆదేశించారు. రూ.14 కోట్లు నష్టపరిహారం ఇవ్వండి... అరెస్టు వారంట్ ఇచ్చిన చీఫ్ జస్టిస్ ఖెహర్ సహా ఏడుగురు న్యాయమూర్తుల సుంప్రీంకోర్టు ధర్మాసనంపై కర్ణన్ తీవ్రంగా స్పందించారు. తనను న్యాయ సంబంధిత, పరిపాలనా పనులు చేసుకోనివ్వకుండా నియంత్రించినందుకు గానూ రూ.14 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని ధర్మాసనంలోని ఏడుగురు న్యాయమూర్తులకు గురువారం లేఖ రాశారు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన ధర్మాసనాన్ని రద్దు చేసి, తన రోజువారీ పనిని చేసుకోనివ్వాలని కోరారు. ‘ఈ ఏడుగురు జడ్జీలూ మార్చి 8 నుంచి నన్ను న్యాయ, పరిపాలనా పనులు చేసుకోకుండా అడ్డుకున్నారు. సాధారణ జీవితంతో పాటు కోట్ల మంది భారతీయుల ముందు అవమానించినందుకు ధర్మాసనంలోని ఆ జడ్జీలూ ఈ ఆదేశాలను అందుకున్న వారం లోగా రూ.14 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
సీజేపై ఫిర్యాదు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్‌పై, న్యాయమూర్తి కర్ణన్ గిరిజన, వెనుకబడిన వర్గాల కమిషన్‌కు ఫిర్యాదు చేసి చర్చకెక్కారు. హైకోర్టులో ఈ చర్చ ఊపందుకోవడంతో కలకలం రేగింది. సాక్షి, చెన్నై : హైకోర్టు పరిధిలోని ఇతర కోర్డులో న్యాయమూర్తుల నియామకం సంబంధించి ఓ కమిటీని గత నెల ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ ప్రకటించారు. న్యాయమూర్తులు ధనపాలన్, సుధాకర్, హరి పరంధామన్, కృపాకరణ్, రమలకు ఆ కమిటీలో చోటు దక్కింది. ఈ కమిటీకి వ్యతిరేకంగా న్యాయమూర్తి కర్ణన్ గలం విప్పడం చర్చకు దారి తీసింది. ఈ కమిటీలోని ధనపాలన్ నియామకంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. అలాగే, సుధాకర్, హరి పరంధామన్ బంధువులు అని, ఆ ఇద్దర్నీ ఒకే కమిటీలో ఎలా నియమిస్తారన్న ప్రశ్నను లేవదీయడంతో పాటుగా ఆ కమిటీ నియామకాన్ని రద్దు చేశారు. మరుసటి రోజే కర్ణన్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ, న్యాయమూర్తులు తమిళ్ వానన్, సెల్వన్ నేతృత్వంలోని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఉన్నది. ఈ పరిస్థితుల్లో తనను సీజే సంజయ్ కిషన్ కౌల్ కించ పరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గిరిజన, వెనుకబడిన వర్గాల కమిషన్‌కు కర్ణన్ ఫిర్యాదు చేయడం హైకోర్టులో చర్చకు దారి తీసింది. తాను దళితుడ్ని కాబట్టి సీజే తనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసి ఉన్నట్టుగా హైకోర్టులో చర్చ సాగుతుండటంతో ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నదోనన్న ఉత్కంఠ బయలుదేరి ఉన్నది. -
శిశువు తొడల్లో మంటలు
శిశువు తొడల్లో మంటలు వచ్చి చర్మం కాలిపోయే వ్యాధి ఏమిటో అంతు చిక్కడం లేదు. ఇది వైద్య వర్గాలకు ఓ సవాల్‌గా మారింది. విల్లుపురం నుంచి ఆ శిశువును కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో కెమెరా పర్యవేక్షణలో ఐదుగురు వైద్య బృందం ఆ శిశువుకు చికిత్స అందిస్తోంది. సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా మైలం సమీపం నొడి గ్రామానికి చెందిన కర్ణన్, రాజేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరిలో నర్మద పెద్దది. కుమారుడు రాహుల్ పుట్టగానే వార్తల్లోకి ఎక్కాడు. ఆ శిశువు శరీరం నుంచి మంటలు రావడంతో ఆ వ్యాధి ఏమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. వైద్య పరీక్ష అనంతరం రాహుల్ బాగానే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈనెల 9న మూడో బిడ్డకు జన్మనిచ్చిన రాజేశ్వరి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ శిశువు శరీరంలోనూ మంటలు చెలరేగడంతో వైద్య శాస్త్రానికి మళ్లీ పరీక్ష ఎదురైంది. ఆ శిశువు కాళ్లు, తొడ భాగంలో మంటలు రావడం, ఆ భాగాలు కాలిపోవడంతో మైలం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. రాజేశ్వరి, కర్ణన్ దంపతులకు మళ్లీ వింత శిశువు జన్మించిన సమాచారం మీడియాల్లో చూసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పందించారు. సీఎం పన్నీరు సెల్వం ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఆ శిశువు పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక వార్డు : ఆ శిశువును మైలం ఆస్పత్రి నుంచి శనివారం రాత్రి చెన్నై కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఆ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు. ఆ వార్డులో ఆ శిశువును ఫోకస్ చేస్తూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాలిన గాయాలకు వైద్య పరీక్షలు అందించారు. మెరుగైన వైద్య పరీక్షలను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వైద్య బృందం అందిస్తోంది. ఆ ఆసుపత్రి డీన్ గుణ శేఖరన్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం ఆ శిశువును 24 గంటల పాటుగా పరీక్షిస్తోంది. మంత్రి విజయ భాస్కర్ ఆ శిశువును పరిశీలించారు. తల్లిదండ్రుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆందోళన వద్దని, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ వేదనను పరిగణించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అంతు చిక్కని వింత : గతంలో రాహుల్ శరీరంలో మళ్లీ మంటలు రాకుండా కట్టడి చేసిన వైద్యులు, ఆ వ్యాధికి గల కారణాల అన్వేషణలో తలలు పట్టుకుంటున్నారు. అంతు చిక్కని ఈ వ్యాధి మళ్లీ రాహుల్ సోదరుడిని వెంటాడడంతో పరిశోధనల్ని తీవ్రతరం చేశారు. రాజేశ్వరికి ప్రత్యేకంగా వైద్య పరీక్షల్ని నిర్వహించి పరిశోధనకు నిర్ణయించారు. ఆమెలో ఏదేని లోపం ఉన్నదా? తద్వారా, ఈ మంటలు వస్తున్నాయూ? అన్న అన్వేషణ మొదలైంది. రాజేశ్వరి, కర్ణన్ స్వగ్రామంలో అయితే, కొత్త ప్రచారం ఊపందుకుంది. తమ గ్రామంలో దుష్ట శక్తి తిష్ట వేసిందని, ఆ కుటుంబంలో పుట్టిన మగ బిడ్డల మీద ఆ శక్తి తన ఆగ్రహాన్ని చూపుతోందన్న ప్రచారం బయలు దేరడం కొసమెరుపు. -
హైకోర్టు జడ్జికి బెదిరింపులు
చెన్నై: సామాన్యులు మొదలు సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తులకు సైతం బెదిరింపులు వస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సంఘటనకు సంబంధించి జస్టిస్ కర్ణన్.. రిజిస్ట్రార్ జనరల్, అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్టు కోర్టులో వెల్లడించారు. న్యాయమూర్తి సూచనల మేరకు సంబంధిత నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ జనరల్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.