Bellamkonda Sreenivas to Remake Dhanush’s Tamil SuperHit Movie Karnan In Telugu - Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: మరో సూపర్‌ హిట్‌ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ

Published Thu, Apr 29 2021 2:21 PM | Last Updated on Thu, Apr 29 2021 8:50 PM

Bellamkonda Sreenivas To Star In The Telugu Remake Of Karnan - Sakshi

అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్‌ కూడా పడలేదు. దీంతో రీమేక్‌ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్‌ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్‌ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలోఘీ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ మూవీ రీమేక్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీకీ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బెల్లంకొండ సరసన నటించేందుకు ఇదివరకే కొందరు స్టార్‌ హీరోయిన్లను సైతం సంప్రదించినా వారు మాత్రం నో చెప్పారట. దీంతో ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు అనన్య పాండే ఒప్పుకుందని టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు బెల్లంకొండ ఇప్పుడు మరో రీమేక్‌ చిత్రంతో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇటీవల ధనుష్‌ హీరోగా తమిళంలో ‘కర్ణన్’ సూపర్‌ రిలీజైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సూపర్‌ హిట్‌ మూవీని తెలుగులో రీమేక్‌ చేయాలని అనుకుంటున్నారట.

ఇప్పటికే బెల్లంకొండ ఈ మూవీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బెల్లంకొండ తెలుగులో నటించిన చివరి మూవీ అల్లుడు అదుర్స్‌’. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను రిలీజ్‌ చేసినా బాక్స్‌ఫీస్‌ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. దీంతో కర్ణన్‌ మూవీని రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాలని చూస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. 

చదవండి : 'ప్రభాస్‌ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను'
నిర్మాతగా మారిన యంగ్‌ హీరో.. తండ్రితో తొలి సినిమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement