
తిరువొత్తియూరు(చెన్నై): కోర్టు ధిక్కార నేరం కింద ఆర్నెళ్ల జైలుశిక్ష పూర్తికావడంతో కలకత్తా హైకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ సీకే కర్ణన్ విడుదలయ్యారు. కోల్‌కతాలోని ‘ప్రెసిడెన్సీ కరెక్షనల్ హో మ్’ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు కర్ణన్ విడుదలైనట్లు ఆయన భార్య సరస్వతి మీడియాకు తెలిపారు. జస్టిస్ కర్ణన్ త్వరలోనే ఆత్మకథ రాయనున్నట్లు ఆయన న్యాయవాది మ్యాథ్యూ.జె.నెడంపుర వెల్లడించారు. పెన్షన్ తదితర సమస్యల్ని పరిష్కరించుకుని ఆయన త్వరలోనే చెన్నైకి బయలుదేరుతారన్నారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడటంతో సుప్రీం కోర్టు మే 9న జస్టిస్ కర్ణన్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. దీంతో జస్టిస్ కర్ణన్ పరారుకాగా.. సుప్రీం ఆదేశాలతో పోలీసులు కోయంబత్తూర్‌లో జూన్ 20న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment