చెన్నై: సామాన్యులు మొదలు సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తులకు సైతం బెదిరింపులు వస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు.
ఈ సంఘటనకు సంబంధించి జస్టిస్ కర్ణన్.. రిజిస్ట్రార్ జనరల్, అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్కు సమన్లు జారీ చేశారు. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్టు కోర్టులో వెల్లడించారు. న్యాయమూర్తి సూచనల మేరకు సంబంధిత నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ జనరల్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
హైకోర్టు జడ్జికి బెదిరింపులు
Published Wed, Jun 18 2014 1:15 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement