23న రాష్ట్రానికి కేంద్ర బృందం
నోట్ల రద్దు ప్రభావంపై అధ్యయనం
- క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై ఆరా
- వివిధ రంగాల వారీగా నష్టాన్ని నివేదించనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థా రుులో వాస్తవ పరిస్థితులు, నోట్ల రద్దు ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర అధికారుల బృందం ఈనెల 23న రాష్ట్రానికి రానుంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బృందం రెండు రోజులు పర్యటించనుంది. వివిధ శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ బృందంలో ఉంటారు. తెలంగాణలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎలా ఉందో అధ్యయనం చేస్తారు. బ్యాంకులు, ఏటీఎంలు ఎలా పనిచేస్తున్నాయి.. ప్రజలకు, ఖాతాదారులకు సత్వర సేవలందిస్తున్నాయా లేదా అనే దాన్ని క్షేత్రస్థారుులో పరిశీలిస్తారు. రైతులు, చిరు వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు, అసంఘటిత రంగాల వారిపై ఎలాంటి పరిణామాలున్నాయో అడిగి తెలుసుకుంటారు.
రాష్ట్రంలోని దాదాపు 85 శాతం ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకు బ్రాంచీల్లోనూ కరెన్సీ లేక డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రీ పగలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలలో నిరీక్షిస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం రాక ప్రాధాన్యం సంతరించుకుంది. నోట్ల రద్దు వల్ల వివిధ రంగాలపై తీవ్ర ప్రభావముం టుందని, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయే ప్రమాదముం దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వివిధ శాఖలు, రంగాల వారీగా ప్రభావాన్ని విశ్లేషించే నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర బృందానికి ఈ నివేదికను అందజేసి పరిస్థితు లను వివరించనుంది. ఈ మేరకు నివేదిక తయారు చేసేందుకు సమాచారం పంపించాలని సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది.
నేడు వీడియో కాన్ఫరెన్స్
నోట్ల రద్దు నిర్ణయం అమలు తీరును తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్వహించే ఈ కాన్ఫరెన్‌సకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకుల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన నగదు మార్పిడి, బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన నగదు, ప్రజలు పడుతున్న అవస్థలపై చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 8వ తేదీ రాత్రి తెలంగాణలోని అన్ని బ్యాంకులకు రూ.8,000 కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్‌బీఐ వర్గాలు వెల్లడించారుు. ఇప్పటివరకు రూ.6,000 కోట్ల నగదు మార్పిడి జరిగిందని, దాదాపు రూ.9,500 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల్లో జమ అరుునట్లు బ్యాంకర్లు అంచనాగా వెల్లడించారు. సరిపడేన్ని నోట్లు ఆర్‌బీఐ సరఫరా చేయటం లేదని, అందుకే ఖాతాదారులకు నిర్దేశించిన పరిమితికి లోబడిన డబ్బు కూడా ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు.