
నోట్ల సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తాం: హరీశ్ రావు
సిద్దిపేట జోన్: పెద్ద నోట్ల రద్దు సమస్యలపై రైతులు, వ్యాపారుల నుంచి తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. దీనికి సంబంధించి బ్యాంకుల్లో విత్‌డ్రా పరిమితులను సడలించాలని కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు డిమాండ్లతో కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు. కరెన్సీ మార్పిడి వ్యవహారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.