సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడి అక్రమాల్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు దొరికిపోతుండగా, తాజాగా బెంగళూరులో ఐపీఎస్ అధికారి భార్య, ఆర్బీఐ అధికారిణిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని నృపతుంగ రోడ్‌లో ఉన్న రిజర్వు బ్యాంకు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళాధికారి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన పాత పెద్ద నోట్లను అక్రమ మార్గాల్లో మార్చడానికి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన సదరు మహిళాధికారిపై సీబీఐ అధికారులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. భర్త ఐపీఎస్ అధికారి ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్న కొంత మంది కర్ణాటక మంత్రులు తమ వద్ద ఉన్న రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు నల్లధనాన్ని అక్రమ మార్గాల్లో వైట్‌మనీగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి.
సహకార బ్యాంకులపై విచారణ: నవంబర్ 10–14 తేదీల్లో మంగళూరు జిల్లా సహకారి బ్యాంకులోని సేవింగ్స్ అకౌంట్లలో రూ.428 కోట్లు డిపాజిట్ అయినట్లు సమాచారం. డీసీసీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పెద్ద మొత్తంలోని నగదుకు సంబంధించి వివరాలను సేకరించడానికి నాబార్డుతో విచారణ జరిపించనుంది.
నోట్ల మార్పిడిలో ఆర్బీఐ ఆఫీసర్ హస్తం!
Published Thu, Dec 22 2016 3:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
Advertisement