
మాటల గారడీతో మభ్యపెడుతున్నారు
దుబ్బాక సభలో సీఎం కేసీఆర్‌పై తమ్మినేని ధ్వజం
దుబ్బాక: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటల గారడీతో ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహా జన పాదయాత్రసభలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదని, సీఎం కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ధిపొందారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర రంగాలకు మళ్లిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.
‘నోట్ల రద్దు’పై కేసీఆర్ వైఖరి మార్చుకోవాలంటూ తమ్మినేని లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల రద్దు’అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పునరాలోచించాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీరభద్రం బుధవారం సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా ధర్మారంలో బాలయ్య అనే రైతు ‘నోట్ల’సమస్య కారణంగా తన కుటుంబానికి విషమివ్వగా.. ఆయనతో పాటు తండ్రి గాలయ్య కూడా మృతి చెందారని పేర్కొన్నారు.