
నోట్ల రద్దు ప్రయోగం ఫెయిలా!
• ఇప్పటికే ప్రభుత్వం చేతికి 59% పెద్ద నోట్లు
• మిగిలిన నోట్లు కూడా గడువుకల్లా
• జమ కావొచ్చన్న అంచనాలు
• అందుకే మరో స్వచ్ఛంద ఆదాయ
• వెల్లడి పథకం అంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టి, ఆ మేరకు ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుందామని అనుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం విఫలమైనట్టేనా...? బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా వచ్చి పడుతున్న చెల్లని నోట్లను గమనిస్తే ఆర్థిక రంగ పండితులకు ఈ సందేహాలే తలెత్తుతున్నారుు. ఈ సందేహాలు నిజమయ్యే సూచనలూ కనిపిస్తున్నారుు.
ప్రస్తుత డీమోనిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా చెల్లని నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 31 వరకు... అంటే మరో నెల రోజుల వ్యవధి ఉంది. అప్పటికి జమయ్యే మొత్తంలో నల్లధనం పరిమాణం మేరకు నగదు బ్యాంకు ఖాతాల్లోకి రాకుండా ఉండాలి. పన్ను అధికారుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయంతో లెక్కల్లో చూపని నగదును ఖాతాల్లో డిపాజిట్ చేయరన్న అంచనాలున్నారుు. కానీ ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితం రాకపోవొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నారుు...?
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నవంబర్ 10 నుంచి 27వ తేదీ మధ్య వెనక్కి వచ్చిన పెద్ద నోట్ల సమాచారాన్ని మాత్రమే ప్రకటించింది. దీని ప్రకారం... నవంబర్ 10-27 మధ్య బ్యాంకుల్లో రూ.8.47 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యారుు. ఇది వ్యవస్థలో చెల్లుబాటు కాకుండా పోరుున రూ.500, రూ.1,000 నోట్ల విలువ రూ.15.45 లక్షల కోట్లలో... 54.6 శాతానికి సమానం. సాధారణంగా బ్యాంకుల్లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా కొంత నగదు నిల్వలు ఉంటారుు. గతేడాది కాలంలో సగటున చూసుకుంటే బ్యాంకులు రూ.70వేల కోట్ల నగదు నిల్వలను కలిగి ఉన్నారుు. అక్టోబర్ 28 నాటికి ఈ నిల్వలు రూ.75,000 కోట్లుగా ఉన్నారుు. వ్యవస్థలోని నగదులో రూ.500, రూ.1,000 నోట్లు 86 శాతం కనుక... బ్యాంకుల్లోని నగదు నిల్వల్లో చెల్లకుండా పోరుున పెద్ద నోట్ల విలువ రూ.64,500 కోట్లు. అంటే ఇప్పటివరకూ బ్యాంకుల వద్ద జమ అరుున పెద్ద నోట్లు, ఇప్పటికే బ్యాంకుల వద్దనున్న నోట్లతో కలుపుకుంటే... రద్దరుున పెద్ద నోట్ల రూపంలో ప్రభుత్వానికి చేరిన మొత్తం 59 శాతంగా ఉంది. ఇక వ్యవస్థలో మిగిలి ఉన్న పెద్ద నోట్లు 41 శాతమే.
చివరకు మిగిలేది...?
నల్లధనం కలిగిన వారు ఆదాయపన్ను నిఘాకు దొరక్కుండా పక్క దారులు వెతుక్కోవడం సహజం. ప్రస్తుత డీమోనిటైజేషన్ సమయంలోనూ ఇలాంటి దాఖలాలు కనిపిస్తున్నారుు. ఉదాహరణకు నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేవలం రెండు వారాల్లోనే... ఎప్పుడూ నామమాత్రపు నగదు నిల్వలతో ఉండే జన్‌ధన్ ఖాతాల్లో రూ.27,000 కోట్లు డిపాజిట్ అయ్యారుు. లెక్కల్లో చూపని నగదు ఈ ఖాతాల్లోకి వచ్చిందన్న సందేహాలకే ఈ గణాంకాలు ఆస్కారమిస్తున్నారుు. మరో నెల రోజుల వ్యవధిలో వ్యవస్థలో చెల్లుబాటు కాకుండా పోరుు మిగిలి ఉన్న 41% పెద్ద నోట్లలో గణనీయ స్థారుులో బ్యాంకుల్లోకి వస్తే ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్టే. దీర్ఘకాలంలో దేశాభివృద్ధి కోసం స్వల్ప కాలం పాటు కష్టాలు ఓర్చుకోండన్న ప్రభుత్వం... అప్పుడు ఏం చెబుతుందో చూడాలి.
ప్రభుత్వానికీ వాస్తవం బోధపడిందా...?
డీమోనటైజేషన్ విఫలయత్నంగా మారుతుందన్న భయం ప్రభుత్వానికి కూడా పట్టుకుందా..? మరోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడికి అవకాశం కల్పిస్తూ... దీన్ని వినియోగించుకోని వారిపై భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనున్నట్టు ప్రకటించడం ఇందుకేనా...? ఇప్పుడు ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నారుు. తాజాగా ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లెక్కల్లో చూపని నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసి 50 శాతం పన్ను చెలిస్తే సరిపోతుంది. మరో 25 శాతాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీ రహిత ప్రభుత్వ బాండ్లలో డిపాజిట్ చేస్తే ఆదాయపన్ను విచారణలు ఉండవు. మొత్తానికి నయానో, భయానో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్టు తాజా చర్యలు తెలియజేస్తున్నారుు.
అసలు నల్లధనం ఎంత...?
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చాలా మంది సామాన్యులను వేధిస్తున్న ప్రశ్న... అసలు ఆర్థిక వ్యవస్థలో నల్లధనం పాత్ర ఎంత...? పలు అధ్యయనాల ప్రకారం చూస్తే... దేశీయ సమాంతర ఆర్థిక వ్యవస్థ లేదా నల్లధనం అనేది దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో పావు శాతం ఉంటుంది. బ్యాంకు ఆఫ్ మెరిల్ లిచ్ అంచనాల ప్రకారం... భారత జీడీపీ రూ.1,51,78,100 కోట్లు. ఇందులో నల్లధనం 25 శాతం అంటే రూ.37,94,530 కోట్లు. ఈ నల్లధనంలోనూ నగదు రూపంలో ఉన్నది 10 శాతం. అంటే రూ.3,79,450 కోట్లు. ఈ మొత్తం లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణించాల్సి ఉంటుంది.