
పెద్దలకు ముందే లీక్!
• నోట్ల రద్దుపై అధికార పక్ష నేతలకు ముందే తెలుసు: విపక్షాలు
• ఆర్థిక అస్థిరత రాజ్యమేలుతోందంటూ రాజ్యసభలో సర్కారుపై ధ్వజం
• సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్
• లీక్ ఆరోపణలను ఖండించిన అధికార పక్షం
• మృతి చెందిన సభ్యులకు నివాళి తెలిపి వారుుదా పడిన లోక్‌సభ
• నేటి నుంచి దిగువసభలో వాడివేడి చర్చ.. అస్త్రాలతో సిద్ధమైన విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు బుధవారం వాడివేడిగా సాగింది. నోట్ల రద్దు పై అధికార పార్టీ నేతలకు ముందుగానే సమాచారం ఉందని విపక్షాలు దుమ్మెత్తిపోశారుు. విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారుు. పలువురు బీజేపీ నేతలు ముందుగానే నోట్లు మార్చుకున్నారని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపించారుు. దేశంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలుతోందని తీవ్ర ఆరోపణలు చేశారుు. అరుుతే.. ఇవి అర్థరహితమని ప్రభుత్వం ఖండించింది. నవంబర్ 8 నిర్ణయం లీకేజీ వార్తల్లో వాస్తవం లేదని, ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. అందువల్లే ప్రారంభంలో సమస్యలు వచ్చాయంది. సమావేశాల తొలి రోజే నోట్ల రద్దుపై రాజ్యసభలో 7 గంటల చర్చ జరిగింది.లోక్‌సభ కూడా సమావేశమైన కాసేపటికే.. మృతిచెందిన తాజా, మాజీ ఎంపీలకు నివాళులర్పించి వారుుదా పడింది.
మోదీ లక్ష్యంగా.. రాజ్యసభలో చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాసమస్యలను మోదీ సీరియస్‌గా తీసుకోవటం లేదన్నారు. సామాన్యులు, పేదలు, రైతులకు తీవ్ర నష్టం కలిగించిన రూ. 500, రూ.వెరుు్య నోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న అకాల, అనాలోచిత నిర్ణయమన్నారు. దేశంలో పేదలు, మహిళలు, ఉదయం 3 గంటలనుంచే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూల్లో నిలబడితే.. మోదీ జపాన్‌లో నవ్వుతూ బుల్లెట్ రైలు నడిపారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర యూనిట్లు ఒకరోజు ముందుగానే పార్టీ నిధులను బ్యాంకుల్లో జమచేసినట్లు తమకు తెలిసిందన్నారు.
‘ఆర్థిక వ్యవస్థలో 86 శాతం ఉన్న పెద్ద నోట్లను సర్కారు స్తంభింపజేసింది. అంటే ఇంత మొత్తం నల్లధనమని ప్రభుత్వం నిర్ణరుుంచిందా? మిమ్మల్ని ప్రశ్నించే వారందరినీ దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు’ అని ఆగ్రహించారు. ‘దేశ ప్రధానికి నష్టం కలిగించే ఏ చర్యనూ, కాంగ్రెస్‌గానీ, ఈ సభ గానీ సహించదు.ఇంతకూ ప్రధానికి నష్టం కలిగించాలని చూస్తున్నదెవరో చెప్పండి?’ అని ప్రశ్నించారు. నోట్ల రద్దు, బీజేపీకి ముందే సమాచారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. ఇంత కీలకాంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని సభలో ఉంటే బాగుంటుందన్నారు.
యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఎస్పీ బహిష్కృత ఎంపీ నరేశ్‌యాదవ్ విమర్శించారు. విపక్షాలన్నీ నల్లధనాన్ని వ్యతిరేకించటం లేదనేలా ప్రజలను మభ్యపెట్టేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని జేడీయూ నేత శరద్‌యాదవ్ ఆరోపించారు. ‘ప్రజలకు తినేందుకు రొట్టెముక్క లేక బాధపడుతుంటే.. కేక్ తినమని చెప్పిన ఫ్రెంచ్ రాణి మేరీ అంటోనిటే లాగే.. మోదీ కూడా పేపర్ లేకపోతే ప్లాస్టిక్ వాడండని చెబుతున్నార’ని సీతారాం ఏచూరీ(సీపీఎం) ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుపై ప్రధాని చెప్పిన ఏ వివరణా అర్థవంతంగా లేద’న్నారు.
రాజకీయం కాదు.. దేశం కోసమే
విపక్షాల విమర్శలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. దేశ అవసరాలు, అవినీతి, నల్లధనానికి చెక్ పెట్టడంతోపాటు దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీని వల్ల దేశానికి దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నారు. ఉగ్రవాదం, అవినీతి నుంచి విముక్తికోసం సామాన్యులు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే ఉన్నారని.. ఈ నిర్ణయం వల్ల ద్రవ్యోల్బణం, పన్నురేటు తగ్గుతాయన్నారు. నల్లధనం ఉన్నవారే దీనిపై ఎక్కువగా ఆందోళన చెందుతూ పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. ‘చిన్న సమస్యలున్నారుు.
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి నిర్ణయం ఇది. అందుకే వారూ సహకరిస్తున్నారు’ అని తెలిపారు. ‘మోదీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నామని అంటున్నారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తే సహజంగానే వీరు అవినీతికి వ్యతిరేకమా కాదా అనే అనుమానాలు వస్తున్నారుు. చిన్న చిన్న ఇబ్బందులున్నా ప్రజలంతాప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించటం విపక్షాలకు ఇబ్బందికరంగా మారినట్లుంది’ అని చెప్పారు. అకౌంట్ల లో హఠాత్తుగా పెరుగుతున్న మొత్తంపై చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు.
లోక్‌సభలో.. లోక్‌సభ మొదలవగానే ఆగస్టు 16న అకాల మరణం చెందిన టీఎంసీ ఎంపీ రేణుకా సిన్హాతోపాటు ఇటీవల మృతిచెందిన మాజీ సభ్యులు విజయలక్ష్మి, ఆరిఫ్ బేగ్, కణ్ణన్, హర్ష వర్ధన్, జయవంతి, ఉషావర్మలకు నివాళులర్పించింది. ఇజ్రారుుల్ మాజీ అధ్యక్షుడు పెరెస్, థాయ్‌లాండ్ రాజు అదుల్యదేజ్‌లకూ నివాళర్పించి మౌనం పాటించింది. సభ గురువారానికి వారుుదా పడింది.
అన్ని చర్చలకు మేం సిద్ధం
శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లెవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పార్లమెంటు సెషన్లో జీఎస్టీ బిల్లుపై విపక్షాల సహకారంతో కేంద్రం కీలకమైన అడుగు ముందుకేసిందన్నారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీలు కలసిపనిచేయాన్నారు. కాగా, గురువారం నుంచి లోక్‌సభలో సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యారుు.