చితికిన చిరుజీవి
ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి
పేరు: కె.నాగశివ,
వ్యాపారం: కొబ్బరి బోండాల విక్రయం
ఏరియా: వనస్థలిపురం
►నోట్ల రద్దుకు ముందు: రోజుకు రూ.3 వేల విక్రయాలు
►ఆదాయం: రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12 వేలు
►నోట్ల రద్దు తర్వాత: రోజుకు రూ.500 విక్రయాలు
►ఆదాయం: రోజుకు రూ.80 చొప్పున నెలకు రూ.2400
► నెలవారీ ఖర్చులు: ఇంటిఅద్దె రూ.3 వేలు, పిల్లల ఫీజులు రూ.2 వేలు, నిత్యావసరాలు: రూ.3 వేలు మొత్తం: 8000
అవస్థలివీ..
ఫైనాన్షియర్ నుంచి తీసుకున్న రూ.50 వేల అప్పుకుగాను రోజువారీగా రూ.500 చొప్పున చెల్లించడం లేదు. దీంతో ఫైనాన్షియర్‌ల ఒత్తిళ్లు.
►రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించ లేదు. ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ వార్నింగ్
►కొనేవారు లేక తెచ్చిన కొబ్బరిబోండాలు మురిగిపోతున్నాయి.
►బ్యాంకులకు ఐదుమార్లు వెళ్లినా నగదు దొరకలేదు.
► రెండు నెలలుగా మరో రూ.10 వేలు అప్పు చేసి కుటుంబ పోషణ.
రోజుకు వంద కూడా కష్టమే..
పేరు: అనిత
వ్యాపారం: కూరగాయల విక్రయం
ఏరియా: బీఎన్‌రెడ్డినగర్
నోట్ల రద్దుకు ముందు: రోజుకు రూ.2 వేల విక్రయాలు
ఆదాయం: రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12వేలు
నోట్ల రద్దు తర్వాత : కనాకష్టంగా రోజుకు రూ.400 విక్రయాలు
ఆదాయం: రోజుకు రూ.70 చొప్పున నెలకు రూ.2100
నెలవారీ ఖర్చులు:ఇంటి అద్దె రూ.2500, పిల్లల ఫీజులు:రూ.1500, నిత్యావసరాలు:రూ.3 లు..మొత్తంగా: రూ.7వేలు
అవస్థలివీ...
►ఇంటి అద్దె, పిల్లల ఫీజులు చెల్లించడం కష్టమవుతోంది
► రోజుకు రూ.100 కూడా గిట్టుబాటు కావడంలేదు.
► తెచ్చిన కూరగాయలు కొనేవారు లేక మురిగిపోతున్నాయి.
► దరలు దిగివచ్చినా కొనేవారు లేరు.
► కుటుంబ పోషణకు రూ.10 వేలు అప్పు అడిగితే ఎవరూ ఇవ్వడంలేదు.
కుటుంబం చిన్నాభిన్నం
పేరు: ప్రసాద్, పని: తాపీ మేస్త్రీ
నోట్ల రద్దకు ముందు: రోజూ పని దొరికేది. నెలకు కనీసం రూ.15–18 వేల వరకు వచ్చేది.
ఖర్చులు: ఇంటి అద్దె రూ.3000, చీటీ వాయిదా రూ.5000, నిత్యావసరాలు: రూ.3000, రూ.1000 పాల బిల్లు..మొత్తం రూ.12 వేలు
ప్రస్తుతం నెలవారీ ఆదాయం: రూ.5 వేల లోపలే (రోజూ పనిదొరకడంలేదు)
అవస్థలు ఇవీ...
నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నెలకు రూ.5 వేలు కూడా సంపాదించలేని దుస్థితి. ఒక వేళ పని దొరికినా చేసిన పనికి యజమాని నగదు ఇవ్వడం లేదు. వారానికి ఒకసారి చెక్కు రూపంలో ఇస్తున్నారు. హైదరాబాద్‌లో బ్యాంకు ఖాతా లేదు. దీంతో ఒంగోలు పంపి అకౌంట్‌లో వేయగా బ్యాంక్ నుంచి చెక్ క్లియరెన్స్ రావడానికి 15 రోజులు పడుతుంది. తీరా ఎకౌంట్‌లో జమ చేసిన తర్వాత చేతికి డబ్బులు రాలేదు. పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా డబ్బుల్లేక భార్య, పిల్లలను సొంతూరుకు పంపాడు. ఇంటి యజమాని అద్దె కోసం ఒత్తిడి చేశారు. చేసేది లేక ఇళ్లు ఖాళీ చేశాడు. ప్రస్తుతం ఇక్కడ ఒక్కడే ఉంటూ..పని చేస్తున్న చోటే ఇంటి యజమానిని బతిమిలాడి..తాత్కాలికంగా ఓ గుడిసె వేసుకున్నాడు. కుటుంబం చిన్నాభిన్నమైందని విలపిస్తున్నాడు.