
గులాబీ సంబరాలకు బ్రేక్?
- రెండున్నరేళ్ల పాలనపై 2న జరగాల్సిన కార్యక్రమం ప్రశ్నార్థకం
- పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అధినాయకత్వం పునరాలోచన
సాక్షి,హైదరాబాద్: అధికారంలోకి వచ్చి డిసెంబర్ 2 నాటికి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భాన్ని సంబరంగా జరుపుకోవాలన్న నిర్ణయంపై అధికార టీఆర్‌ఎస్ పునరాలోచనలో పడిందా? దీనికి పార్టీ వర్గాలు అవుననే బదులిస్తున్నారుు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు, ప్రభుత్వ తాజా ఆర్థిక పరిస్థితి వంటి పరిణామాల నేపథ్యంలో సం బరాలకు దూరంగా ఉండాలనే ఆలోచనకు సీఎం కేసీఆర్ వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారుు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు పార్టీ కొత్త కమిటీలు, రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల కమిటీలను నియమించుకుని, వారితో ఒక రోజు సమావేశమై ఆ తర్వాత డిసెంబర్ 2న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆవల భారీ బహిరంగ సభను నిర్వహించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. గత రెండున్నరేళ్లలో ఎదురైన సవాళ్లు, సమస్యలను అధిగమించిన తీరు, సాధించిన ప్రగతి వివరాలను దీని ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం భావించారు. అలాగే వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించీ ప్రజలకు వివరించాలనుకున్నారు. కానీ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఈ సంబరాలకు బ్రేక్ పడినట్లే అని తెలుస్తోంది.
నోట్ల రద్దుతో గందరగోళం: కొత్త రాష్ట్రం కావడంతో వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నామని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నారుు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలపై పడటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రతి నెలా కనీసం రూ. 2 వేల కోట్ల రాబడికి కోత పడినట్లు అంచనా వేశారు. ఈ పరిణామం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, చెల్లింపులపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే దిగువ, మధ్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు కూడా చిల్లర సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు కొంత గందర గోళంగా తయారైన నేపథ్యంలో రెండున్నరేళ్ల సంబ రాల జోలికి వెళ్లక పోవడమే మంచిందన్న అభిప్రా యం వ్యక్తమైనట్లు పార్టీ వర్గాల సమాచారం.
భారీ ఖర్చు, జనం తరలింపు సమస్యలే కారణం!: నోట్ల రద్దు సమస్యకుతోడు ఇప్పటికే పూర్తి కావాల్సిన పార్టీ సంస్థాగత కమిటీల నియామకం వారుుదాపడింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన సమావేశం కూడా జరగలేదు. ఎక్కడికక్కడ కొంత అయోమయం నెలకొనడం, బహిరంగ సభ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, ప్రజలను సభకు తరలించడం సమస్యగా మారే అవకాశం కూడా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంబరాలను వారుుదా వేసుకోవడమే మంచిదన్న నిర్ణయానికి అధినాయకత్వం వచ్చిందని చెబుతున్నారు.