మళ్లీ రియల్ బూమ్ వస్తుందా?
• పెద్ద నోట్ల రద్దు సానుకూలమంటున్న సంస్థలు
• వడ్డీ రేట్లు తగ్గే అవకాశం; అందరూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి..
• జీఎస్టీ, రెరా బిల్లులతో ఊపందుకున్న నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కొన్నేళ్ల పాటు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్థిరాస్తి రంగాన్ని.. తాజాగా పెద్ద నోట్ల రద్దు మరింత కుదిపేస్తోంది. మరి, ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం మళ్లీ పట్టాలెక్కుతుందా? దేశంలో మళ్లీ రియల్ బూమ్ వస్తుందా? అంటే స్థిరాస్తి రంగ విశ్లేషకులు మాత్రం కచ్చితంగా వస్తుందని ఢంకా బజారుుస్తున్నారు. ఇదిగో అంటూ పలు కారణాలను ఉదహరిస్తున్నారు కూడా. అవేంటో మీరే చదవండి మరి.
• దేశంలో పాత నోట్ల మార్పిడితో బ్యాంకులకు కట్టలకొద్ది నగదు వచ్చి చేరుతోంది. అధిక నగదు కారణంగా సమీప భవిష్యత్తులో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. ప్రస్తుతం 9.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లు కాస్తా 7-8 శాతానికి తగ్గే అవకాశముందని చెబుతున్నారు.
• రైతులు, చిన్న వ్యాపారులు, వర్తకులు, కాంట్రాక్టర్ల వంటి వారందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు. దీంతో వీరందరూ రుణాలకు అర్హత పొందుతారు. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా నెలసరి వారుుదా (ఈఎంఐ) కూడా తగ్గుతుంది. దీంతో సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకునే వీలుంది.
• వచ్చే దశాబ్ద కాలంలో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వలస వస్తారు. స్టార్టప్స్, సెల్ఫ్ ఎంప్లారుుమెంట్ పెరుగుతుంది. ఆయా రం గాలకూ సీడ్ క్యాపిటల్, బ్యాంకు రుణాలు కూడా సులువుగానే వస్తా రుు. దీంతో అర్బన్ ఏరియాల్లో ఉండే స్థిరాస్తికి గిరాకీ పెరుగుతుంది.
• తక్కువ వడ్డీ రేట్ల కారణంగా కొనుగోలుదారులనే కాదు పెట్టుబడిదారులూ స్థిరాస్తి రంగం వైపే ఆకర్షితులవుతారు. దీంతో ఈ భారీ ఎత్తున పెట్టుబడులొస్తారుు. ఉదాహరణకు బ్యాంకులో రూ.50 లక్షలు డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ 5 శాతం. అదే రూ.50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే దాని మీద వచ్చే నెలవారి అద్దె రూ.20-25 వేల మధ్య ఉంటుంది. పెపైచ్చు ఏటా స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంటుంది. ఆదాయ పన్ను రారుుతీలూ ఉంటారుుక్కడ.
• స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, హౌసింగ్ ఫర్ ఆల్, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, జాతీయ రహదారుల అనుసంధానం, రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు, వంటి పలు కార్యక్రమాలతో నగరాలు అభివృద్ధి చెందనున్నారుు. దీంతో దేశంలో స్థిరాస్తి రంగం మళ్లీ బూమ్ రావటం ఖాయం.
• స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో స్థిరాస్తి రంగం వాటా 7 శాతం పైనే. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రంగమూ ఇదే. 140కి పైగా అనుబంధ రంగాలకు వ్యాపార అవకాశాలనూ ఇస్తున్న విభాగమూ రియల్టీనే. అలాంటి స్థిరాస్తి రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని నిపుణులు కోరుతున్నారు.
సామాన్యుడే సమిధ..
• అరుుతే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వస్తు సేవా పన్ను (జీఎస్టీ) స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)లతో రేట్లు పెరిగే అవకాశముంది.
• {పస్తుతం నిర్మాణ సంస్థలు టైల్స్, మార్బుల్స్, ఇనుము, ఇసుక, సిమెంట్, ఉడ్ వంటి నిర్మాణ సామగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిని సీ ఫామ్ ద్వారా కొనుగోలు చేస్తుండటం వల్ల చ.అ.రూ.100 పన్ను తగ్గుతుంది బిల్డర్లకు. కానీ, జీఎస్టీ రాకతో నిర్మాణ సామగ్రిని సొంత రాష్ట్రాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో సీ ఫామ్ కింద తగ్గే రూ.100 పన్ను కూడా బిల్డర్ కస్టమర్ల మీదే వేస్తాడు.
• రెరా బిల్లులోని నిబంధనలను అమలు చేయాలంటే నిర్మాణ సంస్థలు ప్రతి ప్రాజెక్ట్‌ను పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌లకు నిధుల మళ్లింపు, ముందస్తు అమ్మకాలు నిలిపివేత వంటి రకరకాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రెరా బిల్లుతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఎంతలేదన్నా చ.అ.కు రూ.200 వరకూ పెరిగే అవకాశముంది. దీన్ని కూడా కస్టమర్ల మీదే వేస్తారు బిల్డర్లు.