rera bill
-
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
గృహ భరోసా కష్టమే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలో గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు ఏర్పాటైన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) బిల్లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. నిబంధనల ఖరారుతోనే సరిపెట్టేశాయి రెండు ప్రభుత్వాలు. ఆ తర్వాత ఏర్పా టు చేయాల్సిన రెరా అథారిటీ, వెబ్సైట్లను విస్మరించాయి. కేంద్రం ఇచ్చిన అమలు గడువు (2016, మే1) ముగిసి రెండేళ్లు గడుస్తున్నా... నేటికీ కార్యరూపం దాల్చట్లేదు. నిబంధనల్లో స్వల్ప మార్పులకు కేంద్రమిచ్చిన అవకాశాన్ని ఆసరా చేసుకొని రెండు ప్రభుత్వాలూ నిబంధనలను నిర్వీర్యం చేశాయని, కొనుగోలుదారులకు భరోసా కల్పించలేకపోయానని రెరా బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన ఫోరమ్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫోర్ట్స్(ఎఫ్‌పీసీఈ) ఆరోపిస్తోంది. కేంద్రం ఇచ్చిన రెరా అమలు గడువు ముగిసినా నేటికీ తెలంగాణ ప్రభుత్వం రెరా అథారిటీ ఏర్పాటు చేయలేదు. కనీసం నిర్మాణ ప్రాజెక్ట్‌ల నమోదు కోసం వెబ్‌సైట్‌నూ అందుబాటులోకి తీసుకురాలేదు! ఇక, ఏపీలో విచిత్రమైన పరిస్థితి. ట్రిబ్యునల్ ఏర్పాటు మాట పక్కనపెడితే.. అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్‌కు డెవలపర్ల నుంచి ఆదరణే లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో అమల్లోకి వచ్చిన ఏపీ రెరాలో నేటికి నమోదైన ప్రాజెక్ట్‌లు కేవ లం 22. ఇందులో అమోదం పొందినవి రెండంటే రెండే. ఇక, నమోదు చేసుకున్న ఏజెంట్లయితే జస్ట్ ఒక్కరే! నిబంధనలు నిర్వీర్యం.. ఏపీ ప్రభుత్వం రెరా నిబంధనలను రూపొందించి, ఖరారు చేసేందుకు ఏడాది సమయం తీసుకుంది. గతేడాది మే 1, 2017న ఏపీలో రెరా ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది. ఇందులో... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను రెరాలో నమోదు నుంచి తొలగించారు. లేఅవుట్ వెంచర్లలో రోడ్లు, ఓపెన్ ఏరియాలు, వసతులు వంటివి పూర్తయిన వాటిని మినహాయించారు. హౌజింగ్ ప్రాజెక్ట్‌లలో శ్లాబులు పూర్తయిన వాటిని, 50% అమ్మకాలు/ లీజులు పూర్తయిన అపార్ట్మెంట్లు, ప్లాట్లను మినహాయించారు. అలాగే అభివృద్ధి పనులు పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని కూడా రెరాలో నమోదు నుంచి తప్పించారు. కేంద్రం రెరా ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటూ జైలు శిక్ష నిబంధన ఉంది.కానీ, ఏపీ రెరాలో దీన్ని తొలగించి కేవలం ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానాతో సరిపెట్టేశారు. తెలంగాణలో నో ట్రిబ్యునల్, నో వెబ్సైట్.. తెలంగాణ ప్రభుత్వం మరీ దారుణం. గతేడాది ఆగస్టులో రెరా నిబంధనలను ఖరారు చేసింది. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ అథారిటీ, పంచాయతీ, టీఎస్ఐఐసీ నుంచి అనుమతి పొందిన అన్ని ప్రాజెక్ట్‌లూ, ఓపెన్ ప్లాట్లూ రెరా పరిధిలోకి వస్తాయని తెలిపింది. ఇక రెరా అథారిటీ ఏర్పా టు ఊసే ఎత్తట్లేదు. కనీసం ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల నమోదు కోసం వెబ్‌సైట్‌నూ అందుబాటులోకి తీసుకురాలేదు. పైగా ఇటీవలే మహారాష్ట్ర, కర్ణాటక రెరా అమలు తీరును పరిశీలించేందుకు స్థానికంగా అధికారుల కమిటీ పర్యటించింది. మరో 3 నెలల్లో రెరా అథారిటీ ఏర్పాటు చేసే అవకాశముందని సమాచారం. ఆదరణ కరువైన ఏపీ రెరా వెబ్సైట్.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏపీరెరా వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక నిర్మాణ సంస్థలు, ఏజెంట్ల నుంచి పెద్దగా ఆదరణ లేదు. ఇప్పటివరకు ఏపీరెరా వెబ్సైట్లో 22 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా... వాటిలో పనోరమా హిల్స్ బ్లాక్ 2, విన్యాస్ కాన్కోర్డ్ క్యాసిల్ మాత్రమే అనుమతి పొందాయి. ఏడుగురు ఏజెంట్లు నమోదు చేసుకుంటే ఇండియాబుల్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ లిమిటెడ్‌కు మాత్రమే అనుమతి వచ్చింది. ఇప్పటివరకు ఏపీరెరాకు 1 ఫిర్యాదు అందగా అది పరిష్కారం కాలేదు. ఆమోదం పొందిన ప్రాజెక్ట్‌ల వివరాలేవీ ఏపీ రెరా వెబ్సైట్లో పూర్తి స్థాయిలో లేవని ఎఫ్‌పీసీఈ వైస్ ప్రెసిడెంట్ బీటీ శ్రీనివాసన్ ఆరోపించారు. ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఎప్పటిలోగా పూర్తవుతుంది, కీలకపత్రాలు, ఇతరత్రా వివరాలేవీ లేవన్నారు. రెరా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు చేయకూడదు. కానీ, ఏపీలో రిజిస్ట్రేషన్ లేకుండానే కంపెనీలు యథేచ్చగా ప్రకటనలు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం సుమోటాగా కేసు నమోదు చేయట్లేదని ఆయన పేర్కొన్నారు. రెరా కోసం ఎఫ్‌పీసీఈ దేశంలో గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని ప్రతిపాదించింది ఫైట్ ఫర్ రెరా. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్లమెంట్లో రెరా బిల్లును ఆమోదింపజేసింది. తర్వాతి క్రమంలో ఈ ఫైట్ ఫర్ రెరా సభ్యులే ఫోరమ్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ (ఎఫ్‌పీసీఈ) సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం ఇందులో దేశంలోని 200కు పైగా గృహ కొనుగోలుదారుల సంఘాలు సభ్యులతో పాటూ వ్యక్తిగతంలో 2 వేలకు పైగా సభ్యులున్నారు. ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్‌గా అభయ్ ఉపాధ్యాయ్ (కోల్‌కతా), జనరల్ సెక్రటరీ ఎంఎస్ శంకర్ (బెంగళూరు), వైస్ ప్రెసిడెంట్‌గా బీటీ శ్రీనివాసన్ (హైదరాబాద్), కన్వీనర్‌గా కన్నల్ టీపీ త్యాగి (ఘజియాబాద్) ఉన్నారు. -
మళ్లీ రియల్ బూమ్ వస్తుందా?
• పెద్ద నోట్ల రద్దు సానుకూలమంటున్న సంస్థలు • వడ్డీ రేట్లు తగ్గే అవకాశం; అందరూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి.. • జీఎస్టీ, రెరా బిల్లులతో ఊపందుకున్న నిర్మాణాలు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కొన్నేళ్ల పాటు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్థిరాస్తి రంగాన్ని.. తాజాగా పెద్ద నోట్ల రద్దు మరింత కుదిపేస్తోంది. మరి, ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం మళ్లీ పట్టాలెక్కుతుందా? దేశంలో మళ్లీ రియల్ బూమ్ వస్తుందా? అంటే స్థిరాస్తి రంగ విశ్లేషకులు మాత్రం కచ్చితంగా వస్తుందని ఢంకా బజారుుస్తున్నారు. ఇదిగో అంటూ పలు కారణాలను ఉదహరిస్తున్నారు కూడా. అవేంటో మీరే చదవండి మరి. • దేశంలో పాత నోట్ల మార్పిడితో బ్యాంకులకు కట్టలకొద్ది నగదు వచ్చి చేరుతోంది. అధిక నగదు కారణంగా సమీప భవిష్యత్తులో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. ప్రస్తుతం 9.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లు కాస్తా 7-8 శాతానికి తగ్గే అవకాశముందని చెబుతున్నారు. • రైతులు, చిన్న వ్యాపారులు, వర్తకులు, కాంట్రాక్టర్ల వంటి వారందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు. దీంతో వీరందరూ రుణాలకు అర్హత పొందుతారు. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా నెలసరి వారుుదా (ఈఎంఐ) కూడా తగ్గుతుంది. దీంతో సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకునే వీలుంది. • వచ్చే దశాబ్ద కాలంలో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వలస వస్తారు. స్టార్టప్స్, సెల్ఫ్ ఎంప్లారుుమెంట్ పెరుగుతుంది. ఆయా రం గాలకూ సీడ్ క్యాపిటల్, బ్యాంకు రుణాలు కూడా సులువుగానే వస్తా రుు. దీంతో అర్బన్ ఏరియాల్లో ఉండే స్థిరాస్తికి గిరాకీ పెరుగుతుంది. • తక్కువ వడ్డీ రేట్ల కారణంగా కొనుగోలుదారులనే కాదు పెట్టుబడిదారులూ స్థిరాస్తి రంగం వైపే ఆకర్షితులవుతారు. దీంతో ఈ భారీ ఎత్తున పెట్టుబడులొస్తారుు. ఉదాహరణకు బ్యాంకులో రూ.50 లక్షలు డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ 5 శాతం. అదే రూ.50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే దాని మీద వచ్చే నెలవారి అద్దె రూ.20-25 వేల మధ్య ఉంటుంది. పెపైచ్చు ఏటా స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంటుంది. ఆదాయ పన్ను రారుుతీలూ ఉంటారుుక్కడ. • స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, హౌసింగ్ ఫర్ ఆల్, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, జాతీయ రహదారుల అనుసంధానం, రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు, వంటి పలు కార్యక్రమాలతో నగరాలు అభివృద్ధి చెందనున్నారుు. దీంతో దేశంలో స్థిరాస్తి రంగం మళ్లీ బూమ్ రావటం ఖాయం. • స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో స్థిరాస్తి రంగం వాటా 7 శాతం పైనే. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రంగమూ ఇదే. 140కి పైగా అనుబంధ రంగాలకు వ్యాపార అవకాశాలనూ ఇస్తున్న విభాగమూ రియల్టీనే. అలాంటి స్థిరాస్తి రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. సామాన్యుడే సమిధ.. • అరుుతే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వస్తు సేవా పన్ను (జీఎస్టీ) స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)లతో రేట్లు పెరిగే అవకాశముంది. • {పస్తుతం నిర్మాణ సంస్థలు టైల్స్, మార్బుల్స్, ఇనుము, ఇసుక, సిమెంట్, ఉడ్ వంటి నిర్మాణ సామగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిని సీ ఫామ్ ద్వారా కొనుగోలు చేస్తుండటం వల్ల చ.అ.రూ.100 పన్ను తగ్గుతుంది బిల్డర్లకు. కానీ, జీఎస్టీ రాకతో నిర్మాణ సామగ్రిని సొంత రాష్ట్రాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో సీ ఫామ్ కింద తగ్గే రూ.100 పన్ను కూడా బిల్డర్ కస్టమర్ల మీదే వేస్తాడు. • రెరా బిల్లులోని నిబంధనలను అమలు చేయాలంటే నిర్మాణ సంస్థలు ప్రతి ప్రాజెక్ట్‌ను పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌లకు నిధుల మళ్లింపు, ముందస్తు అమ్మకాలు నిలిపివేత వంటి రకరకాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రెరా బిల్లుతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఎంతలేదన్నా చ.అ.కు రూ.200 వరకూ పెరిగే అవకాశముంది. దీన్ని కూడా కస్టమర్ల మీదే వేస్తారు బిల్డర్లు.