ఖజానాకు ‘పెద్ద నోట్ల’ కళ
- డిస్కంకు రూ.202 కోట్లు... జలమండలికి రూ.30 కోట్లు
- జీహెచ్‌ఎంసీకి రూ.157 కోట్ల ఆదాయం
- రద్దు నోట్లతో చెల్లింపునకు 24 వరకు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దరుున రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకారుులు చెల్లించవచ్చన్న వెసులుబాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నారుు. జీహెచ్‌ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దరుు న నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లిం పు గడు వును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగిం చింది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి రికార్డు స్థారుులో ఆదాయం సమకూరుతుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకారుు వసూలవుతున్నారుు. ట్రాఫిక్ ఈ-చలాన్ కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నారుు.
జీహెచ్‌ఎంసీకి రికార్డు ఆదాయం...
జీహెచ్‌ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల రూ పంలో రికార్డు స్థారుు లో దాదాపు రూ.157 కోట్లు వసూల య్యారుు. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూ లైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్‌ఆర్‌ఎస్ కూడా చెల్లిస్తుండటం విశేషం.
పెరిగిన బకారుుల చెల్లింపులు: పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి బకారుులు పెద్ద ఎత్తున వసూలవుతున్నారుు. 4 రోజుల్లో రూ.30 కోట్ల వర కు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగారుు.
భారీగా వసూలైన విద్యుత్ చార్జీలు
విద్యుత్ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యారుు. సెలవు దినమైనప్పటికీ విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యారుు. కొందరు విని యోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు.
ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లింపులు
ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను కూడా వాహనదారులు రద్దరుున నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు. మీ-సేవ, ఈ-సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది.