సాక్షి, ముంబై: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్‌కు బ్లాక్‌డీల్ షాక్ తగిలింది. మార్కెట్ ఆరంభంలోనే బలహీపడిన ఈ షేర్ తరువాత మరింత పతనమైంది.బ్లాక్ డీల్ ద్వారా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్‌లో భారీ స్థాయిలో షేర్లు చేతులు మారడంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సగటు రేటు ఎంత అనేది స్పష్టం కానప్పటికీ 58.50 లక్షల షేర్లను విక్రయించింది. దీంతో దాదాపు 3.6 శాతానికిపైగా పతనమైంది.
కాగా ప్రైవేట్ ఇక్విటీ సంస్థ బైన్ కాపిటల్ 2.12 శాతం లేదా 5శాతంషేర్లను విక్రయించనుందని తద్వారా రూ. 750 కోట్లను సమకూర్చుకోనుందని ఇటీవల ఎల్ అండ్ టి ఫైనాన్స్ ప్రకటించింది. మరోవైపు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌లో పెట్టుబడి ద్వారా దాదాపురెండేళ్లలో 150 శాతం రిటర్న్స్‌ను బైన్ కాపిటల్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment