అంచనాలను అందుకున్న టీసీఎస్ ఫలితాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికం ఫలితాలు అంచనాలను అందుకునేవిధంగా ఉన్నాయి. టీసీఎస్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6శాతం వృద్ధితో రూ. 6,055.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే సంస్థ మొత్తం ఆదాయం విషయంలో మాత్రం అంచనాలకు దూరంగా ఉండిపోయింది.
రెండో త్రైమాసికంలో సంస్థ రెవెన్యూ ఆదాయం 5.8శాతం పెరిగి.. రూ. 27,165 కోట్లకు చేరుకుంది. డాలర్ ఆదాయం మూడు శాతం మాత్రమే పెరిగి 4,156 మిలియన్ డాలర్లకు చేరుకుంది. డాలర్తో పోలిస్తే కాన్స్టంట్ కరెన్సీ రెవెన్యూ మూడుశాతానికి మించి పెరుగకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది.