క్యూ2లో రూ. 299 కోట్లు
న్యూఢిల్లీ: మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 299 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 346 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,169 కోట్ల నుంచి రూ. 4,783 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,868 కోట్ల నుంచి రూ. 4,569 కోట్లకు పెరిగాయి. కాగా.. ఆదాయంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ. 1,323 కోట్లు లభించగా.. మెటల్ ఆధారిత ప్రొడక్టుల నుంచి రూ. 404 కోట్లు, మొబిలిటీ బిజినెస్ నుంచి రూ. 168 కోట్లు చొప్పున అందుకుంది.
ఫలితాల నేపథ్యంలో టీఐఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 4,312 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment