సాక్షి, ముంబై: కార్ల తయారీ దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆసక్తికర ఫలితాలను నమోదు చేసింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఈ ఏడాది రెండో క్వార్టర్ నికర లాభం 3 శాతం జంప్ చేసి రూ. 2484 కోట్లను ఆర్జించింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఇది రూ. 2,401 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 22 శాతం ఎగసి రూ, 21,768 కోట్లను ప్రకటించింది. గత ఏడాది ఆదాయం 20, 323గా ఉంది. నికర అమ్మకాలు 22 శాతంఎగిసి రూ.2,438 కోట్లుగా ఉంది.
ప్రకటనల వ్యయాలు, కమోడిటీ ధరలు మార్జిన్లను దెబ్బతీసినట్లు ఫలితాల విడుదల సందర్భంగా మారుతీ సుజుకీ పేర్కొంది. ప్రస్తుతం ఫారెక్స్, కమోడిటీ వ్యయాల్లో అనిశ్చితి ఏర్పడినట్లు తెలియజేసింది. ఇకపై చౌకకానున్న వడ్డీ రేట్లు పరిశ్రమను ఆదుకోనున్నట్లు అంచనా వేసింది. జీఎస్‌టీ నేపథ్యంలోనూ క్యూ2లో వాహన పరిశ్రమ 13 శాతం వృద్ధిని సాధించినట్లు వివరించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకి షేరు 1.5శాతం బలపడి కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment