
సాక్షి, తూర్పుగోదావరి: అయినవిల్లి మండలం మడుపల్లి ఓఎన్జీసీ సైట్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆయిల్ ట్యాంకర్లు దగ్ధమయ్యాయి. ఓఎన్జీసీ అధికారులు కనీస జాగ్రత్తలు పాటించలేదు. టెస్టింగ్ పేరుతో వారం నుంచి భారీశబ్దంతో గ్యాస్ విడుదల చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి సమీప గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి.. అధికారులను ఎమ్మెల్యే చిట్టిబాబు అప్రమత్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
చదవండి: ముస్లిం యువత మానవత్వం..
హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment