ముంబై: సూదుల్లా గుచ్చుకునే వర్షపు చినుకులు... రెప్పలు తెరిస్తే కనుగుడ్లనే పెకిలించేలా వస్తున్న హోరుగాలి..... ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్న రాకాసి అలలు.. తుపాను తీవ్రత అతాలకుతలం అవుతూ ఏక్షణమైనా మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న పడవ... మృత్యువు ముంగిన నిలిచినప్పుడు... జీవితపు చివరి క్షణాల్లో ఓ నౌక సిబ్బంది తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రమాదం ముంగిట
టౌటే తుపాను ధాటికి ముంబై తీరంలో ఓఎన్జీసీకి చెందిన నాలుగు నౌకలు మునిగిపోయాయి. దాదాపు 70 మంది వరకు చనిపోగా మరో 20 వరకు ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే మునిగిపోయిన నాలుగు పడవల్లో వరప్రద కూడా ఒకటి. ప్రమాద సమయంలో పడవలో 13 మంది ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికారు. అయితే తుపాను ధాటికి ఈ పడవ మునిగిపోతున్నప్పుడు ఓ వ్యక్తి ఆ దృశ్యాలు వీడియో తీశాడు. నేవీ అధికారులకు ఆ ఫోన్ లభించగా అందులో వీడియోను రిలీజ్ చేశారు.
Breath taking video of Tug Varaprada @ABPNews @abpmajhatv pic.twitter.com/ISmvTzO7Kl
— Ganesh Thakur (@7_ganesh) May 25, 2021
Comments
Please login to add a commentAdd a comment