ముగ్గురు ఓఎన్‌జీసీ సిబ్బందిని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు | Terrorists Kidnap Three ONGC Employees At Assam | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఓఎన్‌జీసీ సిబ్బందిని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు

Published Thu, Apr 22 2021 2:20 PM | Last Updated on Thu, Apr 22 2021 4:47 PM

Terrorists Kidnap Three ONGC Employees At Assam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: అస్సాంలోని ఆయిల్‌ అండ్‌ నేచరల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. ఆయుధాలు కలిగిన అయిదుగురు ఉగ్రవాదులు శివసాగర్‌లోని కార్యాలయంలోకి ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. కంపెనీకి చెందిన ఎమర్జెన్సీ కమ్‌ మెడికల్‌ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

అనంతరం ఆ వాహనాన్ని నిమోనగర్‌ అడవి వద్ద వదిలేశారని వెల్లడించారు. ఈ అడవి అస్సాం–నాగాలాండ్‌ సరిహద్దులో ఉంది. ఈ ఘటనానంతరం ఉన్నత స్థాయి రివ్యూ సమా వేశం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement