
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ, కార్యకలాపాలు కొనసాగించడానికి తగిన నిధులు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఓఎన్‌జీసీ భరోసానిచ్చింది. అంతే కాకుండా 100 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని ఓఎన్‌జీసీ తెలిపింది. కేంద్రానికి 62.78 శాతం వాటా ఉండటంతో కేంద్ర ఖజానాకు రూ.3,949 కోట్లు డివిడెండ్ ఆదాయం లభించగలదని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment