న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,015 కోట్ల నికర లాభాన్ని (స్డాండ్ అలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.4,352 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి సాధించామని ఓఎన్‌జీసీ తెలిపింది.
ఉత్పత్తి తగ్గినా ధరలు అధికంగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించినట్లు తెలియజేసింది. మొత్తం ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.24,122 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఇబిటా 20 శాతం వృద్ధితో రూ.10,919 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇబిటా మార్జిన్ మాత్రం స్వల్పంగా తగ్గి 47.5 శాతానికి చేరింది.
తగ్గిన చమురు ఉత్పత్తి: గత క్యూ3లో 51.80 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తి వ్యయం ఈ క్యూ3లో 60.58 డాలర్లకు పెరిగింది. ముడి చమురు ఉత్పత్తి 1% తగ్గి 5.2 మిలియన్ టన్నులకు తగ్గిందని, అయితే గ్యాస్ ఉత్పత్తి మాత్రం 4.5% వృద్ధితో 6 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరిందని సంస్థ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది చమురు, గ్యాస్ క్షేత్రాల్లో నిక్షేపాలు కనుగొన్నామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్ 0.4% తగ్గి రూ.188 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment