
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 820 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12 కోట్ల నికర నష్టం ప్రకటించింది.
మొత్తం ఆదాయం సైతం 42 శాతం జంప్‌చేసి రూ. 26,612 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 26,171 కోట్లను దాటాయి. కంపెనీకి ప్రధానమైన ఇంటిగ్రేటెడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగం పన్నుకుముందు లాభం 370 శాతం దూసుకెళ్లి రూ. 669 కోట్లను తాకింది. ఈ బాటలో మైనింగ్, న్యూఎనర్జీ లాభాలు 3 రెట్లు ఎగసినట్లు కంపెనీ పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం బలపడి రూ. 1,750 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment