
ఫేస్ బుక్ కు భారీ లాభాలు
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది.
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. ఆదాయం 11.3 శాతం పెరిగిందని ఫేస్ బుక్ ప్రకటించింది. 4.5 బిలియన్ డాలర్ల రాబడి ఆర్జించినట్టు తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో రాబడి 4.04 బిలియన్ డాలర్లుగా నమోదైంది. యాక్టివ్ యూజర్ల సంఖ్య గణనీయమైన పెరగడంతో రాబడి పెరిగిందని వివరించింది.
మొబైల్ ఎడ్వర్టైజింగ్ ఆదాయం ఏకంగా 78 శాతం ఏకబాకడం విశేషం. 2014 మూడో త్రైమాసికంలో ఇది 66 శాతంగా నమోదైంది. తమకు 155 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని ఫేస్ బుక్ ప్రకటించింది. యూజర్ల ఏటేటా పెరుగుతోందని, రోజూ 100 కోట్ల మంది స్టేటస్ అప్ డేట్ ను షేర్ చేస్తున్నారని తెలిపింది. అంతకుముందు క్వార్టర్ తో పోలిస్తే 896 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత త్రైమాసికంలో 719 మిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది.
మూడో త్రైమాసికంలో మంచి లాభాలు ఆర్జించామని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. నవీన ఆవిష్కరణలతో యూజర్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని అన్నారు.