
న్యూఢిల్లీ: నాన్‌బ్యాంక్ వెల్త్ సొల్యూషన్స్ కంపెనీ ఆనంద్ రాఠీ వెల్త్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 43 కోట్లను అధిగమించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 29 శాతం ఎగసి రూ. 140 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 109 కోట్ల టర్నోవర్ నమోదైంది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూ ఎం) 20 శాతం వృద్ధితో రూ. 38,517 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ, ఫై నాన్షియల్ ప్రొడక్టుల విక్రయం తదితర ఫైనాన్షియల్ సర్వీసులను కంపెనీ అందిస్తోంది.
ఫలితాల నేపథ్యంలో ఆనంద్ రాఠీ వెల్త్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.4 శాతం జంప్‌చేసి రూ. 773 వద్ద ముగిసింది. తొలుత రూ. 780 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment