
సాక్షి, ఆసిఫాబాద్: ఆదివాసీ ఆరాధ్యుడు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వోన్ ఫ్యూరర్ హైమన్‌డార్ఫ్ 31వ వర్ధంతిని గురువారం కుము రం భీం జిల్లా జైనూర్ మండలం మార్ల వాయిలో ఆదివాసీలు ఘనంగా జరపనున్నారు. 1940వ దశకంలో ఆస్ట్రియా దేశపు ఆంత్రోపాలజిస్టు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేసి వారి స్థితిగతులను ప్రపంచానికి తెలియజేశారు.
మార్లవాయిలో నివసించిన ఆయన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ఆదివాసీల సమస్యలు వివరించి వారికోసం కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించేలా కృషి చేశారు. 1987లో హైమన్ డార్ఫ్ బార్య ఎలిజబెత్, 1995లో డార్ఫ్ లండన్‌లో చనిపోగా వారి కోరిక మేరకు వారి చితాభస్మం తెచ్చి సమాధులు నిర్మించా రు. అప్పటి నుంచి ఆదివాసీలు డార్ఫ్ వర్ధంతిని ఏటా నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment