=ఆదివాసీలపై గుర్తుతెలియని
=వ్యక్తుల దాడి భీతిల్లిన జనం
=మద్దతుగా ఆయా పార్టీల నేతల ఆందోళన
=20మంది అరెస్టు, రిమాండ్
నాగోలు/మన్సూరాబాద్,న్యూస్‌లైన్: ‘ఎన్నోయేళ్లుగా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాం..ఉన్నట్టుండి పొమ్మంటే ఎలా..చావనైనా చస్తాం కానీ..ఇక్కడ్నుంచి పోయేది లేదు.. దాడులకు భయపడమని’ ఆదివాసీలు స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలంలో నివాసముంటున్న ఆదివాసీలపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో వచ్చి దాడి చేయడంతో శనివారం వారంతా ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఆయా పార్టీల నాయకులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.
ఎల్‌బీనగర్ మన్సూరాబాద్ డివిజన్ సర్వేనెం.66/6లో ఆదివాసీకాలనీలో కొన్నేళ్లుగా ఆదివాసీలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఇటీవల భూముల విలువ పెరగడంతో ఆదివాసీకాలనీని ఖాళీ చేయించాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్థలం తమదేనంటూ స్వర్ణకుమారి ఇటీవల డాక్యుమెంట్లతోవచ్చి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో స్థానిక కాం గ్రెస్, టీడీపీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకొని ఆదివాసీలను ఖాళీ చేసే యత్నం కొంతకాలంగా సాగుతోంది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయించాలనుకుంటున్న నాయకులు ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి ఫలక్‌నుమాకు చెందిన కొంతమంది గుండాలను రెండు డీసీఎంలలో తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారు. నిద్రిస్తు న్న వారిని బలవంతంగా లేపి వారిపై కారం,మత్తుస్ప్రే చల్లి వారిని బలవంతంగా డీసీఎంలోకి ఎక్కించి బండ్లగూడ వైపు తరలిస్తుండగా గట్టిగా కేకలు వేశారు. వీరి అరువులు విన్న నైట్‌పెట్రోలింగ్ పోలీ సులు డీసీఎంలను అడ్డగించి నేరుగా పోలీసుస్టేషన్ కు తరలించారు. అక్కడినుంచి ఆదివాసీలను గుడిసెలకు చేర్చారు. ఓ గుడిసెలోని బీరువాలో రూ.40వేలతోపాటు పలు సామాన్లను దుండగులు అపహరించారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.
అండంగా ఉంటాం..: దాడుల విషయం తెల్సుకున్న మాజీఎంపీ అజీజ్‌పాషా, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దగౌని రాంమోహన్‌గౌడ్, సీపీఐ గ్రేటర్ కార్యదర్శి బోస్, ఆయా పార్టీల నేతలు ఆకుల రమేష్‌గౌడ్, స్వామిగౌడ్,కళ్ళెం రవీందర్‌రెడ్డి, తుమ్మల సత్తిరెడ్డి, కాచం సత్యనారాయణ, కార్పొరేటర్ వ జీర్‌ప్రకాష్‌గౌడ్,గిరిజసంఘం నాయకులు శివనాయక్, గోపినాయక్ తదితరులు ఆదివాసీకాలనీకి చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించారు. తామంతా అండగా ఉంటామని, ఎవరూ ఖాళీ చేసి వెళ్లవద్దని సూచించారు.
ఈ క్రమంలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా నాయకులు వారించారు. స్థానిక టీడీపీ నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డిలు తమ అనుచరులతో ఆదివాసీలను భ్రయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నారని అజీజ్‌పాషా ఆరోపించారు. 20 మంది రిమాండ్ : అర్ధరాత్రి సమయంలో దాడిచేసి బీభత్సం సృష్టించిన 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్‌బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
అర్ధరాత్రి అలజడి
Published Sun, Jan 5 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement