సాక్షి, అమరావతి : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులేస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే ఆదివాసీలకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రూ. 300 కోట్ల విలువైన వరాలను ప్రభుత్వం ప్రకటించనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో రూ. 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఇతర ఉపకరణాలను పంపిణీ చేయనుంది.
సంపదను దోచుకునేందుకు చంద్రబాబు కుట్ర : జంగా
గిరిజనుల్లో పేదరికాన్ని తోలగించి, వారిని ఉన్నత విద్యవంతులుగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన మట్లాడుతూ.. ఏపీ సహజ వనరులకు పుటినిల్లు అని.. ఆ సంపదను దోచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని విమర్శించారు. గిరిజనుల హక్కులు కాపాడటం కోసం సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదివి ఇచ్చి గౌరవించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పనులు, పదవుల్లో 50 శాతం కేటాయించారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment